సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు వన్ నేనొక్కడినే చిత్రం చేశాడు. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్. ఆమెకు ఇది డెబ్యూ మూవీ. 'హలో రాక్ స్టార్' సాంగ్ లో మహేష్ అడుగు జాడలను హీరోయిన్ కృతి సనన్ చేతులతో తాకుతున్న షాట్ ఉంటుంది. ఈ షాట్ కి సంబంధించిన పోస్టర్స్ విడుదల కాగా, సమంత తప్పుబట్టారు. సదరు పోస్టర్ జోడించి అసహనం వెల్లడించారు.