1000 కోట్ల సినిమాను, ఒక్క యంగ్ హీరో కోసం వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Published : Feb 06, 2025, 03:10 PM IST

ఒక హీరో కోసం తనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను వదులుకుంది ఓ స్టార్ హీరోయిన్. అసలే ప్లాప్ సినిమాలతో ఫ్రెడ్షిప్ చేస్తోన్న ఈ బ్యూటీ.. యంగ్  హీరో కోసం ఈ త్యాగం చేసింది..? ఏకంగా 1000 కోట్ల సినిమాను వదిలేసింది. ఇంతకీ అసలెవరు ఆ హీరోయిన్..?   

PREV
15
1000 కోట్ల సినిమాను, ఒక్క యంగ్ హీరో కోసం వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు చెప్పిరావు. అనుకోకుండా తలుపు తడుతుంటాయి.  కాని వాటిని ఉపయోగించుకోకపోతే.. ఎప్పటికీ స్టార్లు కాలేరు. కాని కొన్ని కారణాల వల్ల కొన్ని అవకాశాలు చేజారి పోతుంటాయి. ఓ హీరోయిన్ పరిస్థితి కూడా అలానే అయ్యింది. యంగ్ హీరో కోసం వెనకడుకు వేసి.. 1000 కోట్ల ప్రాజెక్ట్ ను వదిలేసింది. ఆయంగ్ హీరో  సినిమాకు ఇచ్చిన కమిట్ మెంట్ కోసం ఈ పిచ్చిపనిచేసింది బ్యూటీ. 

25

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అనన్య పాండే. బాలీవుడ్ లో చాలా ప్రశాంతంగా..ఏ హడావిడి లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళే అనన్య పాండే.. పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలని ప్రయత్నం చేసింది. విజయ్ దేవరకొండ  జంటగా లైగర్ సినిమాలో నటించి మెప్పించింది. కాని ఈసినిమా ఆమెకు నిరాశను మిగిల్చింది. లైగర్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే.. డిజాస్టర్ అయ్యింది. దాంతో చాలా కాలం అనన్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచి..లైఫ్ ను ఎంజాయ్ చేసింది. 
 

35
Photo Courtesy: Ananya Pandey/Instagram

ఇక అనన్య పాండే సినిమాల విషయంలో పెద్దగా హడావి డిచేయదు. పెద్దగా టెన్షన్ కూడా తీసుకోదు. లైగర్ కనక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉంటే అనన్య పాండే రేంజ్ మరోలా ఉండేది. అయితే అనన్య పాండేకి మరో గోల్డెన్ ఆఫర్ కూడా వచ్చిందట. బాలీవుడ్ లో ఓ స్టార్ డైరెక్టర్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలో ఆఫర్ వచ్చిందట. ఈసినిమాను 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా తెరకెక్కించాలి అనుకున్నారట. 
 

45

ఆ దర్శకుడు ఎవరో కాదు బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ.  ప్రేమ కథలు తీయ్యడంలో ఈ దర్శకుడి తరువాతే ఎవరైనా. యంగ్ స్టార్ ఒక్క సారి అయినా ఇంతియాజ్ తో కలిసి పనిచేయాలి అని  అనకుంటారు. ఆయన ఓ భారీ పీరియాడికల్ మూవీ చేయాలి అనుకున్నాడట. అందులో హీరోయిన్ గా అనన్యను తీసుకోవాలి అని సంప్రదించాడట.  అసలే ప్లాప్ సినిమాల మధ్య ఇబ్బందిపడుతున్న అనన్యకు ఇది గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి. 

55

కాని అనన్య పాండే మాత్రం బాలీవుడ్ యంగ్ హీరో  కార్తీక్ ఆర్యన్ కు సంబంధించిన సినిమాను కమిట్ అయ్యి ఉందట అనన్య పాండే. దాంతో ఇంతియాజ్ సినిమాకు ఆమె సున్నితంగా తిరస్కరించిందని టాక్. చిన్న సినిమా అయినా..పెద్ద సినిమా అయినా.. ఒక సినిమా కమిట్ అవ్వడంతో  పెద్ద సినిమాను కూడా వద్దనకుందని తెలిసి అనన్య పాండేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏది ఏమైనా ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని.. అనన్య రెండు సార్లు గోల్డెన్ ఛాన్స్ ను మిస్ అయ్యిందని చెప్పవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories