Mahesh babu-Ram Charan: మహేష్‌ బాబు చేయాల్సిన కథ రామ్‌ చరణ్‌కి.. ఇప్పటి వరకు చూడని యాక్షన్‌ మూవీ

Published : Feb 06, 2025, 01:55 PM IST

Mahesh babu-Ram Charan: రామ్‌ చరణ్‌ ఓ భారీ యాక్షన్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, మహేష్‌ బాబు చేయాల్సిన మూవీని చరణ్‌ చేయబోతున్నట్టు సమాచారం.

PREV
15
Mahesh babu-Ram Charan: మహేష్‌ బాబు చేయాల్సిన కథ రామ్‌ చరణ్‌కి.. ఇప్పటి వరకు చూడని యాక్షన్‌ మూవీ
maheshbabu, ram charan

Mahesh babu-Ram Charan: ఒక హీరో చేయాల్సిన కథని మరో హీరో చేయడం కామన్‌గానే జరుగుతుంది. ఆ హీరో ఒప్పుకోకపోవడంతో మరో హీరోని దర్శకులు అప్రోచ్‌ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా మహేష్‌ బాబు చేయాల్సిన ఓ కథ ఇప్పుడు రామ్‌ చరణ్‌ వద్దకు వచ్చిందట. దీనికి ఆయన ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఆ కథేంటి? ఆ దర్శకుడు ఎవరు? అసలేం జరిగిందనేది చూస్తే. 

25

రామ్‌ చరణ్‌ ఇటీవలే `గేమ్‌ ఛేంజర్‌`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్‌సీ16 మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. రెండు రోజుల క్రితమే తన కూతురు క్లీంకారతో సహా చరణ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శివ రాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 

35

ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు చరణ్‌. ఇది వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు సందీప్‌ రెడ్డి వంగాతోనూ మూవీ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ రూమర్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనికితోడు సందీప్‌ రెడ్డి వంగా తన ఆఫీస్‌లో చిరంజీవి ఫోటో పెట్టుకోవడం, ఇటీవల మెగా ఫ్యామిలీని సందీప్‌ కలవడంతో ఆ రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. 
 

45
Sandeep Reddy Vanga

ఇదిలా ఉంటే తాజాగా మరో ఆసక్తికర అప్‌ డేట్‌ వినిపిస్తుంది. ఆ మధ్య సందీప్‌ రెడ్డి వంగా మహేష్‌ బాబుతో సినిమా చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ కథ విషయంలో సెట్ కాలేదు. ఆ కథనే రామ్‌ చరణ్‌కి చెప్పారని, చరణ్‌ చేయడానికి రెడీగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇది భారీ యాక్షన్‌ మూవీ అని, చరణ్‌ గతంలో ఎప్పుడూ చేయని విధంగా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయమే హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇది కూడా రూమరేనా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. 
 

55
maheshbabu, ram charan

అయితే సందీప్‌ రెడ్డి వంగా త్వరలో ప్రభాస్‌తో `స్పిరిట్‌` మూవీ చేయాల్సి ఉంది. అనంతరం అల్లు అర్జున్‌తో సినిమా చేయాలి. ఆ తర్వాతనే రామ్‌చరణ్‌ మూవీ ఉండే అవకాశం ఉంది. దీనికి రెండుమూడేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా సందీప్‌ రెడ్డి వంగాతో రామ్‌ చరణ్‌ మూవీ అంటే ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనే చెప్పాలి. ఈ రూమర్‌ అయితే మెగా ఫ్యాన్స్ ని హ్యాపీగా చేస్తుంది. నిజమైతే వారి సంతోషానికి అవదుల్లేవని చెప్పొచ్చు.

read more:#Ajithkumar: అజిత్ 'పట్టుదల' సినిమా రివ్యూ

also read: Allu Vs Mega: మరో సారి రామ్ చరణ్ విషయంలో దొరికిపోయిన అరవింద్, ట్రోలింగ్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories