#Ajithkumar: అజిత్ 'పట్టుదల' సినిమా రివ్యూ

Published : Feb 06, 2025, 01:30 PM ISTUpdated : Feb 06, 2025, 01:33 PM IST

#Ajithkumar: విడాముయర్చి చిత్రం తెలుగులో పట్టుదల పేరుతో విడుదలైంది. ఈ రోడ్ థ్రిల్లర్‌లో అజిత్, త్రిష నటించారు. కథా కథనాలు బలహీనంగా ఉన్నాయి.

PREV
16
#Ajithkumar: అజిత్ 'పట్టుదల' సినిమా రివ్యూ
Ajith, Vidaamuyarchi, pattudala, Telugu news

అజిత్ సినిమాలు తమిళంలో బాగానే ఆడుతున్నాను కానీ తెలుగులో ఈ మధ్యన అసలు వర్కవుట్ కావటంలేదు. దానికి తోడు ఇక్కడ మార్కెట్ పై దృష్టి పెట్టడం లేదు. ప్రమోషన్స్ చేయటం లేదు. తాజాగా ఆయన హీరోగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ 'విడాముయ‌ర్చి' రిలీజైంది.

మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం  తెలుగులో 'పట్టుదల'గా విడుదల చేసారు. ఈ సినిమా ఎలా ఉంది, అసలు కథేంటి , అజిత్‌ కుమార్‌ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు మాట నిజమవుతుందా చూద్దాం 

26
Ajith, Vidaamuyarchi, pattudala, Telugu news


స్టోరీ లైన్
 
12 సంవత్సరాల కాపురం అనంతరం వేర్వేరు కారణాలతో విడిపోదామనుకున్న జంట అర్జున్, కాయల్  (త్రిష, అజిత్). ఈ క్రమంలో తన భార్యను పుట్టింట్లో దింపుదామని బయిలుదేరతాడు భర్త. అయితే ఆ రోడ్ ట్రిప్ వారికో పీడకలగా మారుతుంది. 

ఆ జర్నీలో భాగంగా పెట్రోల్ పంప్ స్టేషన్  దగ్గర ఆగినప్పుడు అక్కడ ఉన్న సూపర్ మార్కెట్టులో కాయల్‌కు దీపికా (రెజీనా), రక్షిత్ (అర్జున్) దంపతులతో పరిచయం అవుతుంది. ఏదో టెక్నికల్ ప్లాబ్లం  వల్ల హైవేలో కారు ఆగిపోయిందని చెప్తారు.

అప్పుడు రక్షిత్, దీపికల ట్రక్ ఎక్కుతుంది కాయల్. కారు రిపేర్ చేసుకుని వెళ్లిన అర్జున్ షాక్ తింటాడు. ట్రక్కులో కాయల్ లేదు. అర్జున్ ఎవరో తనకు తెలియదని, అతడిని తొలిసారి చూస్తున్నానని రక్షిత్ చెబుతాడు.

కాయల్  హటాత్తుగా మాయమైపోతుంది.  ఎవరు ఆమె ను కిడ్నాప్ చేసారు. అసలు వాళ్లిద్దరూ ఎందుకు విడిపోదామనుకున్నారు. తన భార్యను అజిత్ ఏం చేసి రక్షించుకున్నారు. చివరికి ఏమైంది అనే హై కాన్సెప్టు చుట్టు తిరుగుతుంది. ఇందులో కథ కన్నా కథనమే ప్రధానం. అదేమిటో చూడాలంటే సినిమా చూడాల్సిందే.
 

36
vidaamuyarchi


ఎలా ఉంది

హాలీవుడ్ లో ఎక్కువగా వచ్చే రోడ్ థ్రిల్లరే ఇది. బ్రేక్ డౌన్ అనే సినిమా నుంచే ఈ కాన్సెప్టు తీసుకున్నారనే వివాదం రిలీజ్ కు ముందు నుంచీ జరుగుతోంది. అది నిజమే అని  ఈసినిమా చూసాక అర్దమవుతుంది. ఆ సినిమాకు ఇండియన్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసారు.

ఇలా అందరికీ తెలుసున్న రోడ్ థ్రిల్లర్ మూవీలకు కొత్త నేరషన్ తోడవుతానే సినిమా చూసేవాళ్లకు ప్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఆ విషయంలో స్క్రిప్టు పరంగా ఫెయిలయ్యారనే చెప్పాలి. యాక్షన్ ఎపిసోడ్స్ మీద పెట్టిన శ్రద్ద కథనం పై పెట్టలేదు. ఫస్టాఫ్ లో అయితే అసలు ఏమీ జరిగిన ఫీలింగే రాదు. 

46
Vidaamuyarchi


భార్య,భర్తల రిలేషన్, వారు డైవర్స్ తీసుకోవటానికి కారణం, ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లతో డల్ గా నడుస్తుంది. ఓ యాక్షన్ సినిమా చూద్దామని వెళ్లినవారికి ఈ సెటప్ బోర్ కొడుతుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే త్రిష మిస్సవుతుందో అక్కడ నుంచి కథ పరుగెడుతుంది.

అయితే సెకండాఫ్ లో రిపీట్ సీన్స్ ఎక్కువ బడ్డాయి. అజిత్, పోలీస్ అధికారులు, కథలో మలుపులు లేకపోవటం, అక్కడక్కడే తిరుగుతున్న ఫీల్ రావటం విసిగిస్తుంది. కేవలం ఇంట్రవెల్,క్లైమాక్స్ నమ్మి ఈ సినిమా చేసారనిపిస్తుంది. అర్జున్, రెజీనా పాత్రలు వచ్చాక  కథ పూర్తిగా దారి తప్పినట్లు అర్దమవుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ వస్తాయి, వెళ్తాయి కానీ థ్రిల్ చేయలేకపోయాయి.
i

56
Ajith Kumar Vidaamuyarchis advance collection report out

టెక్నికల్ గా 

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో అదరకొడుతున్న అనిరిథ్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చారు. పాటలు సోసోగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల ఇంటెన్స్ గా సాగి కొంతవరకూ సినిమాని లేపటానికి ట్రై చేసింది.  అయితే అనుకున్న స్దాయిలో అయితే అనిరిథ్ ఈ సినిమాకు సౌండ్స్ ఇవ్వలేదు. ఇక ఓం ప్రకాష్ కెమెరా వర్క్ బాగుంది.

 సినిమాకు ఓ రా ,ఇంటెన్స్ లుక్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఫిల్మ్ కు ఓ మూడ్ ని, టోన్ ని  సెట్ చేసి బాగా ప్లస్ అయ్యింది. శ్రీకాంత్ ఎడిటింగ్ సెకండాఫ్ లో ఇంకాస్త మెరుగ్గా ఉండాలనిపిస్తుంది. బాగా లాగిన ఫీలింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ డైలాగలు ఓకే. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం బాగా డిజైన్ చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ అజిత్ సినిమాలకు ప్రత్యేకంగా చెప్పేదేముంది. దర్శకత్వం పూర్తిగా హాలీవుడ్ సినిమాని అనుకరిస్తూ వెళ్లిపోయింది.
 
నటుల్లో త్రిష, అజిత్ కు వంక పెట్టేదేమీలేదు. అర్జున్ స్పెషల్ గా కనపడ్డారు. రెజీనా గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు.
 

66
Ajith Kumar starrer Vidaamuyarchi film updates out


ఫైనల్ థాట్

ఈ సినిమాకు స్క్రిప్టే బ్రేక్ డౌన్. ఓ హాలీవుడ్ రోడ్  థ్రిల్లర్ ని అదీ ఎప్పుడో చాలా కాలం వచ్చిన సినిమాని ఎడాప్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పటి పరిస్దితులను సినిమాలోకి తీసుకువస్తూ కథ,కథనం అల్లకపోతే అజిత్ ఉన్నా త్రిష ఉన్నా అర్జున్ ఉన్నా ఏమీ చేయలేరు.

Rating:2.5

Read more Photos on
click me!

Recommended Stories