త్రిష సౌత్ సినిమాలో స్పెషల్ గా నిలిచింది. దాదాపు 20 ఏళ్ల కెరీర్ ను కంప్లీట్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ.. మిస్ చెన్నై అందాల పోటీలో విజేతగా నిలిచి ఆతరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 20 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం కొద్దిమంది తారలుమాత్రమే వయసు పెరుగుతున్న కొద్ది గ్లామర్ కూడా పెంచుకుంటూ..నవ యవ్వనంగా ఉంటున్నారు. అందులో నయనతార ఒకరైతే.. త్రిష కూడా అదే కోవలో చేరారు. అరుదైన నటిగా త్రిష గుర్తింపు సాధించింది. ఇక 40 ఏళ్లు దాటినా.. ఇంకా యంగ్ హీరోయిన్ అన్నట్టే ఉంటుంది త్రిష.
ఇలా ఈ వయస్సులో కూడా నవయవ్వనంతో తళతళమెరుపులు మెరిపిస్తుంది కాబట్టే.. త్రిషను వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కంటే ఎక్కువ సినిమా అవకాశాలు త్రిషను వరిస్తున్నాయి. కోలీవుడ్‌లో నటిగా దూసుకుపోతోంది ముద్దుగుమ్మ.
పొన్నియన్ సెల్వంతో త్రిష ఫేట్ మారిపోయింది. హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఏకైక తార త్రిషఒక్కతే. ఆసినిమా తరువాత వరుస ఆఫర్లు ఆమెను వెంటాడుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష.
సౌత్ లో మాత్రమే కాదు.. హిందీలో కూడా ఓ సినిమా చేస్తుంది సీనియర్ తార.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది త్రిష. సినిమా అవకాశాలు పేరుకుపోవడంతో నటి త్రిష సంపాదన మరింత పెరిగింది. మునుపటికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ.. తన ఆస్తులను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తోంది.
ప్రస్తుతం త్రిష ఆస్తి విలువ కూడా అంతకంతకు పెరుగుతోంది. సినిమాకు దాదాపు 10 కోట్ల పైనే డిమాండ్ చేస్తుందట త్రిష. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు 90 నుంచి 100 కోట్ల వరకూ ఉంటుందని అంచన. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ.. చేతినిండా సంపాదిస్తోంది త్రిష. యాడ్స్ ద్వారా ఆమె ఏడాదికి 10 కోట్ల వరకూ సంపాదిస్తుందట.
నటి త్రిషకు చెన్నై, హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నాయి. ప్రస్తుంతం ఆమె చెన్నైలోని 7 కోట్ల విలువైన విలాసవంతమైన భవనంలో ఉంటుంది. అంతే కాదు ఆమె 6 కోట్లతో హైదరాబాద్ హౌస్ ను నిర్మించారు. అన్ని సౌకర్యాలతో అద్భుతంగా ఈ ఇంటిని నిర్మించినట్టు తెలుస్తోంది. కుక్కలు, పిల్లులు సహా పెంపుడు జంతువులను కూడా పెంచుకోవడంలో ఆసక్తి చూపే త్రిష.. వాటి కోసం ప్రత్యేకంగా స్థలం ఉంచి తన ఇంట్లోనే ఉంచుకుంటుంది.
ఇక త్రిష గ్యారేజ్ లో కాస్ట్లీ.. లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ రీగల్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్ వంటి ఎన్నోలగ్జరీ కార్లు త్రిష సొంతం. ఇక విలాసవంతమైన జీవితం గడుపుతున్న త్రిష ఎప్పుడు పెళ్ళి చేసుకుంటుందా.. ఎవరిని చేసకుంటుందా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.