39 ఏళ్ల వయసులో ముచ్చట గా మూడు రికార్డులు సాధించిన త్రిష, దూసుకుపోతున్న చెన్నై చిన్నది

Mahesh Jujjuri | Published : Oct 28, 2023 2:08 PM
Google News Follow Us

హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది త్రిష. నాలుగు పదుల వయస్సు వస్తున్నా.. ఏమాత్రం వన్నె తగ్గకుండా మెరిసిపోతోంది. ఈ ఏజ్ లో మళ్లీ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అటువంటిది విజయ్, అజిత్  లాంటి స్టార్ హీరో కాంబినేషన్ లో త్రిష సినిమాలు చేస్తోంది. 

17
39 ఏళ్ల వయసులో ముచ్చట గా మూడు రికార్డులు సాధించిన త్రిష, దూసుకుపోతున్న చెన్నై చిన్నది

ఫెయిడ్ అవుట్ అయిన హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తే.. ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగానో ఇస్తారు.. మహా అయితే.. ఇంకాస్త గ్లామర్ రోల్స్ చేస్తారు. అంతే కాదు.. హీరోయిన్ గా కెరీర్ ఆపేసి..చాలా కాలం ఖాళీగా ఉన్న త్రిష..మళ్లీ హీరోయిన్ గానే రీ ఎంట్రీ ఇవ్వడం.. ఆమెకు భారీగా డిమాండ్ రావడం అంతా విచిత్రంగా అనిపిస్తుంటుంది. 

27

ఒక్క ఏడాది అయితే.. 40 ఏళ్ళు వస్తాయి త్రిషకు. నాలుగు పదుల వయస్సు వచ్చిందనే కాని.. ఆమెకు ఆ వయస్సు ఉంటుందని ఎవరూ నమ్మరు. అంతే కాదు..అందాన్ని ఆరేంజ్ లో కాపాడుకోవడంతో పాటు.. ఫిట్ నెస్ విషయంలో కూడా అదే మెయింటేనెస్ ను చూపిస్తోంది త్రిష. దాంతో ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. మేకర్స్ ఆమెతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. 

37

త్రిష విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ..చిన్నగా ఫెయిడ్ అవుట్ అయ్యింది అనుకుంటున్న టైమ్ లో ఆమెను 96  సినిమా మళ్లీ పైకి లేపింది. ఈసినిమా  బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా బయ్యర్స్ కి కోట్లల్లో లాభాలను అందించింది. నటిగా కూడా ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ మూవీతో పుంజుకున్న త్రిషకు.. మణిరత్నం మరో సారి లైఫ్ ను అందించాడు. 
 

Related Articles

47
Trisha Krishnan

96 హిట్ తరువాత  మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పీ ఎస్ 1 , పీ ఎస్ 2  సినిమాలు త్రిష కెరీర్ నే మార్చేశాయి. అటు తమిళంలో రికార్డులు సృష్టించాయి. తెలుగులో త్రిష గ్లామర్ పై మనవాల్ళ కళ్లుపడేలా చేశాయి. ముఖ్యంగా పీఎస్ 1 అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పొన్నియన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ ఉన్నప్పటికీ.. అందం, నటన రెండింటి విషయంలో త్రిషనే ఎక్కువ మార్కులు కొట్టేసింది.

57
Actress Trisha Krishnan

ఇక ఇటీవల రిలీజ్ అయిన లియో లో కూడా త్రిష… విజయ్ కి జోడీగా నటించింది. అలాగే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కలెక్ట్ చేస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా యూ.ఎస్ లో లియో సినిమా 5 మిలియన్ల కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.దీనికి ముందు వచ్చిన పీ ఎస్ 1  6 మిలియన్ డాలర్లు, పీ ఎస్ 2  5 మిలియన్ డాలర్లు వసూల్ చేసి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేశాయి.

67

ఇలా ఓ హీరోయిన్ కెరీర్లో బ్యాక్ టు బ్యాట్ 5 మిలియన్ మూవీస్ పడటం ఇదే మొదటిసారి. 39 ఏళ్లలో ఇలాంటి రేర్ రికార్డుని కైవసం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదనే చెప్పాలి. అందుకే తెలుగులో కూడా మళ్ళీ త్రిషకి ఛాన్స్ లు ఇవ్వాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

77
Kollywood Actress Trisha

త్రిషకు వరుసగా ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. అందులోను ఈ ఏజ్ లో ఏ విమెన్ సెంట్రిక్ మూవీస్ వస్తాయో అనుకుంటే.. ఏకంగా హీరోయిన్ గా.. అది కూడా తాను మంచి వయస్సులో ఉన్నప్పుపుడునటించి హీరోల సరసన రావడంతో.. త్రిష డిమాండ్ భారీగా పెరిగింది. మరి ముందు ముందు ఇంకాఅవకాశాలు సాధిస్తుందేమో చూడాలి. 

Read more Photos on
Recommended Photos