ఇక దీపికా విషయానికి వస్తే.. ఆమె డిప్రషన్ నుంచి కోలుకున్న తరువాత అలాంటి సమస్యలతో బాధపడే వారికి అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే 2015లో ది లివ్ లవ్ లాఫ్ అనే ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఆందోళనలు, ఒత్తిళ్లతో సతమతమయ్యే ఎంతోమందికి ఈ వేదికగా ప్రముఖ నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది.