కాజల్ ను చూస్తూ ఉండిపోవాల్సిందే.. స్టార్ హీరోయిన్ లేటెస్ట్ లుక్

First Published | Dec 15, 2023, 6:03 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ వేర్స్ లో అదరగొడుతోంది. నయా లుక్ తో తన ఫ్యాన్స్ ను నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా చందమామ పంచుకున్న ఫొటోలు కుర్ర హృదయాలను కొల్లగొట్టేలా ఉన్నాయి. 

తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ తరం యంగ్ హీరోల అందరితో నటించి మెప్పించింది. లక్షలాదిగా అభిమానులను సంపాదించుకుంది. 

తను కెరీర్ లో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుతో పెళ్లి తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చారు కాజల్. ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ గడిపింది. 


ఇక గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పేరు నీచ్ కిచ్లుగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది.
 

మరోవైపు తన గ్లామర్ ఫొటోలనూ షేర్ చేస్తూ నెటిజన్లను మైమరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసేలా ఫోజులిస్తోంది. 
 

తాజాగా కాజల్ పంచుకున్న ఫొటోస్ చూస్తే కుర్రాళ్లు అలా చూస్తూ ఉండేపోవాల్సిందే.. అనేలా చేసింది. పింక్ అండ్ రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో మతులు పోగొట్టింది. టాప్ గ్లామర్ షోతో మంత్రముగ్ధులను చేసింది. మత్తుగా ఫోజులిస్తూ మైమరిపించింది. 

లేటెస్ట్ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ‘భగవంత్ కేసరి’తో అలరించింది. ప్రస్తుతం ‘సత్యభామ’, ‘ఉమా’, ‘ఇండియన్ 2’ చిత్రాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!