Joruga Husharuga Review : ‘జోరుగా హుషారుగా’ మూవీ రివ్యూ, రేటింగ్! హీరోగా ‘బేబీ’ నటుడు విరాజ్ అశ్విన్

First Published | Dec 15, 2023, 5:00 PM IST

‘బేబీ’ మూవీతో గుర్తింపు దక్కించుకున్న యువ నటుడు విరాజ్ అశ్విన్ హీరో గా ‘జోరుగా హుషారుగా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు విడుదలైన సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం..

చిన్న సినిమాగా వచ్చిన ‘బేబీ’ చిత్రంతో విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. సెకండ్ హీరోగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక తాజాగా విరాజ్ మెయిన్ లీడ్ లో ఓ సినిమా వచ్చింది. అదే ‘జోరుగా హుషారుగా‘ (Joruga Husharuga). ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. హీరోగా అతను మెప్పించాడా? ఇంతకీ సినిమా కథ ఎంటీ? ఎలా ఉందనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం...

కథ :  
సంతోష్ (విరాజ్ అశ్విని)  ఓ ఆఫీస్ లో పనిచేస్తుంటాడు. తను పనిచేసే చోటా ఆనంద్ (మధునందన్) బాస్ గా ఉంటారు. అదే ఆఫీస్ లో సంతోష్ ప్రేమించిన నిత్య (పూజితా పొన్నాడ) టీమ్ లీడ్ గా జాయిన్ అవుతుంది. జాయిన్ అయ్యే ముందు సంతోష్ కు ఎలాంటి ఇన్ఫో ఉండదు. దాంతో షాక్ అవుతాడు. కానీ వాళ్ల ప్రేమ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. తన జాబ్ కోసమూ పలు తంటాలు పడుతుంటాడు. ఈ క్రమంలోనే ఆనంద్ ను ఇష్టపడుతున్న మరో ఎంప్లాయి సుచిత్ర (సిరి హనుమంత్) ను ఒక్కటి చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆనంద్ నిత్యను లవ్ చేయడం ప్రారంభిస్తాడు. మరోవైపు సంతోష్ ఇంటిదగ్గర తండ్రి చేసిన రూ20 లక్షల అప్పు తీర్చాల్సి ఉంటుంది. ఇంతకీ ఆఫీస్ లో తమ ప్రేమను ఎందుకు తెలియనియ్యలేదు? ఆనంద్ నిత్య ప్రేమలో ఎలా పడ్డాడు? సుచిత - ఆనంద్ కలిశారా? వారిని కలిపేందుకు సంతోష్ ఎందుకు ప్రయత్నించాడు? తండ్రికి సాయం చేశాడా? లేదా? అనేది మిగతా సినిమా...


విశ్లేషణ : 
సినిమా కాస్తా ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. యూత్ ను ఇంప్రెస్ చేయడంలో లవ్ సినిమాలకు ఎంతటి పవర్ ఉంటుందో తెలిసిందే. దర్శకుడు అదే కథను ‘జోరుగా హుషారుగా’లో చూపించే ప్రయత్నం చేశారు. ఆఫీస్ లో విరాజ్ పూజిత మధ్య లవ్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ప్రేమించిన అమ్మాయి సడెన్ గా మన ఆఫీస్ లోనే జాయిన్ అయితే జరిగే సన్నివేశాలను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే కామెడీ సీన్స్ కూడా పర్లేదని పించింది. అక్కడక్కడ కాస్తా బోర్ కొట్టించే సన్నివేశాలు ఉంటాయి. సంతోష్ లవ్, ఆఫీస్, తల్లిదండ్రులకు సంబంధించిన సీన్స్ తో ప్రథమార్థం కంప్లీట్ అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మధునందన్ - నిత్యను ప్రేమించడం స్టార్ అయ్యేది ఇక్కడే. దీంతో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ద్వితీయార్థంలో హీరో ఆనంద్ - సుచిత్రలను కలిపేందుకు చేసే ప్రయత్నాలు, నిత్య -సంతోష్ కు మధ్య మనస్పార్థలు, ఇంటి నుంచి అప్పుల ఒత్తిడితో సన్నివేశాలు సాగుతాయి. కాస్తా ఎమోషనల్ గా, టెన్షన్ గానూ కథను నడిపించారు. తండ్రికొడుకుల భావోద్వేగభరిత సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చివర్లలో కామెడీతో ప్రేక్షకులను ఖుషీచేస్తారు. కథకు తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే నడుస్తుంది. ఆకట్టుకునే సన్నివేశాలూ ఉన్నాయి. పాటలు, బీజీఎం పర్లేదనిపిస్తుంది.

నటీనటులు, టెక్నీకల్ :

ప్రధాన పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ లీడ్ రోల్ లో బాగానే నటించారు. డైలాగ్స్, పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. కానీ డాన్స్, కొన్ని కీలకమైన సీన్లలో ఇంకా మెరగవ్వాలి. హావాభావాలనూ పలికిండంలోనూ ఇంకాస్తా శ్రమించాలి. హీరోయిన్ పూజితా తన అందంతో ఆకట్టుకుంది. తన పరిధి మేరకు అలరించింది. సోనూ ఠాకూర్, మధునందన్, రాజేష్ ఖన్నా, బ్రహ్మాజీ, సాయి కుమార్, రోహిణీ తమతమ పాత్రల్లో అలరించారు. కెమెరా వర్క్ బాగుంది. బీజీఎం పర్లేదనిపిస్తుంది. సాంగ్ సందర్భానుసారంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. 

సినిమా పేరు: జోరుగా హుషారుగా
నిర్మాతలు: నిరీష్ తిరువీదుల
బ్యానర్లు: శిఖర & అక్షర ఆర్ట్స్ LLP
తారాగణం : విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, మధునందన్, సాయి కుమార్, రోహిణి మరియు బ్రహ్మాజీ.
దర్శకుడు: అను ప్రసాద్
సంగీతం: ప్రణీత్ మ్యూజిక్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రాఫర్: మహి రెడ్డి పండుగల
విడుదల తేదీ : 15 డిసెంబర్ 2023

రేటింగ్ : 2.75

Latest Videos

click me!