కోలీవుడ్ లవర్ బాయ్ శింబు, హన్సిక గతంలో లవ్‌లో ఉన్నారని చాలా వార్తలు వినిపించాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కే అవకాశముందని జోరుగా ప్రచారం సాగింది. వీరి ప్రేమాయణం ఎంత ఘాటుగా సాగిందంటే..? కానీ అనుకోకుండా వీరిద్దరూ విడిపోయారు. శింబు, హన్సిక ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రియురాలి కోసం శింబు ఏదైనా చేసేవాడు. ఇక ఆమె ఫారిన్ షూటింగ్ కి వెళ్లిందని తెలిసి మరీ అక్కడికి వెళ్లారు.