స్వీట్లు తీసుకు వచ్చాను తింటావా జగతి అని దేవయాని అనగా బయటకు నవ్వుతూ లోపల విషయం పెట్టుకొని తినే అలవాటు లేదు అక్కయ్య అంటుంది జగతి. అప్పుడు దేవయాని కోపంతో,అయినా కన్న కొడుకు చేత తల్లి అని కూడా పిలిపించుకోలేవు కనీసం నువ్వు అయినా కొడుకుని అరే, ఒరేయ్ కాదు కదా కనీసం పేరు పెట్టి రిషి అని కూడా పిలవలేవు.సార్ అని పిలవాలి ఏం బతుకు జగతి అని అనగా అదే సమయంలో రిషి కిందకి వస్తాడు. జగతి కావాలనే రిషి కాఫీ కావాలా, రిషి ఫోన్ వస్తుంది అని అంటుంది.