చిరంజీవికి నిద్ర లేని రాత్రులు గడిపేలా చేసిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఆయన ముందే అసలు విషయం కక్కేసి ఆవేదన

First Published | Oct 13, 2024, 9:03 AM IST

చిరంజీవి నటనకు ఫిదా అవ్వాల్సిందే. మెగాస్టార్‌ గా రాణిస్తున్న ఆయనకు ఓ స్టార్‌ హీరో మాత్రం నిద్ర లేకుండా చేశాడట. ఆ విషయం మొత్తం కక్కేశాడు చిరు. 
 

మెగాస్టార్‌ చిరంజీవి బెస్ట్ డాన్సర్‌ మాత్రమే కాదు, బెస్ట్ యాక్టర్‌. ఆయన యాక్టింగ్ ముందు మిగిలిన వాళ్లు నిలబడలేరంటారు. కోపం అయినా, ఫన్‌ అయినా, యాక్షన్‌ అయినా, అమాయకత్వం అయినా టాలీవుడ్‌లో ఆయన తర్వాతే ఎవరైనా అనేంతగా చేసి మెప్పిస్తారు. ఎంత పెద్ద కమెడియన్స్ ఉన్నా, చిరు కామెడీ ముందు తక్కువే అనిపిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇన్నోసెంట్‌గా చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. `చంటబ్బాయి` సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అందులో ఏజెంట్‌గా చిరు చేసిన రచ్చకి పొట్టచెక్కలవ్వాల్సిందే. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

అంతటి యాక్టింగ్‌తో మెప్పించి తెలుగులో మెగాస్టార్‌ అయ్యారు చిరంజీవి. అప్పట్లో ఆయన్ని మించిన స్టార్‌ లేరని చెప్పొచ్చు. సక్సెస్‌ పరంగానూ, ఇమేజ్‌ పరంగానూ, మార్కెట్‌ పరంగానూ, అత్యధిక పారితోషికం పరంగానూ ఆయన టాప్‌లో ఉన్నారు. అదే సమయంలో సేవ కార్యక్రమాల్లోనూ ముందే ఉన్నారు. అలాంటి చిరంజీవి.. ఓ స్టార్‌ హీరో విషయంలో జెలసీ ఫీలయ్యాడట. ఆయన వల్ల నిద్ర లేని రాత్రులు గడిపారట. మనసు కుదురుగా ఉండలేదట. ఏదో బాధ, ఏదో వెలితి వెంటాడిందట. మరి చిరంజీవికి నిద్ర లేని రాత్రులు గడిపేలా చేసిన స్టార్‌ ఎవరనేది చూస్తే. 
 


ఆయన లోకనాయకుడు కమల్‌ హాసన్‌. నటనలో కమల్‌ ని మించిన నటుడు లేడనే కామెంట్‌ ఉంది. ఇప్పటికీ చాలా మంది ఏదైనా యాక్టింగ్‌ చేస్తుంటే, అరే కమల్‌ హాసన్‌ అంటుంటారు. కమల్‌ హాసన్‌నే మించిపోతున్నావంటారు. నటన పరంగా ఏదైనా మాట్లాడాల్సి వస్తే ముందుగా కమల్‌ పేరు చెబుతుంటారు. చిరంజీవి జెలసీగా ఫీలయ్యింది? నిద్ర లేని రాత్రులు గడిపింది కూడా ఆయన వల్లే అట. అంతేకాదు ఆ బాధని లోపల దాచుకోలేకపోయాడు. కమల్‌ ముందే కక్కేశాడట చిరంజీవి. నీ వల్ల నిద్ర పట్టడం లేదని, మనసు ఏం బాగా లేదని చెప్పాడట చిరంజీవి. దానికి కారణం `స్వాతిముత్యం`  సినిమా కావడం విశేషం. 
 

కమల్‌ హాసన్‌ నటించిన `స్వాతిముత్యం` పెద్ద విజయం సాధించింది. కమల్‌ నటనకు కొలమానంగా చెప్పాల్సి వస్తే అది `స్వాతిముత్యం` అనే చెబుతారు. కమల్‌ హాసన్‌ పేరు కంటే అరే స్వాతిముత్యం అనే అంటుంటారు. దానికి కారణం అందులో కమల్‌ నటనకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇది కమలేనా అనే డౌట్‌ కూడా వస్తుంది. ఇన్నోసెంట్‌ రోల్‌లో అంతే ఇన్నోసెంట్‌గా చేసి మతిపోగొట్టాడు కమల్‌. ఈ మూవీని చూసిన చిరంజీవికి నిద్ర పట్టలేదట. అందులో కమల్‌ నటనకు ఫిదా అయ్యారట. ఆ సినిమా చూశాక, కమల్‌ నటన చూశాక తనకు నిద్ర పట్టలేదని చిరంజీవి.. ఆయనముందే చెప్పారట.
 

Chiranjeevi, Ooty, Vishwambhara

మనసు ఏం బాగా లేదని, రాత్రి నిద్ర పోలేదని అని చెబితే, ఏ ఏమైంది అని అడిగితే `స్వాతిముత్యం` చూశాను, నిద్ర పట్టడం లేదు, అలా ఎలా చేశావ్‌, ఎలా సాధ్యమైంది? అంటూ కమల్‌ని ప్రశంసలతో ముంచెత్తాడట. ఒకరినొకరం ప్రశంసించుకునే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు కమల్‌ ఈ విషయాన్ని చెప్పారు. ఏవీఎం స్టూడియో వద్ద తన సినిమా షూటింగ్‌కి వచ్చిన చిరు, నన్ను చూసి వచ్చి హగ్‌ చేసుకుని ఈ విషయం చెప్పాడని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ పాత వీడియోక్లిప్‌ వైరల్‌ అవుతుంది. 

ఇక చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` సినిమాలో నటిస్తున్నారు. సోషియా ఫాంటసీగా ఇది తెరకెక్కుతుంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. అది మంచి ఆదరణ పొందుతుంది. వీఎఫ్‌ఎక్స్ పరంగా కొంత విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఇక కమల్‌ ఇటీవల `ఇండియన్‌ 2`తో వచ్చి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు ఆయన `థగ్‌ లైఫ్‌` చిత్రంలో నటిస్తున్నారు. లైనప్‌లో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో `కల్కి 2` కూడా ఉన్న విషయం తెలిసిందే. 

సౌందర్య అసలు డ్రీమ్‌ ఏంటో తెలుసా? సినిమాల కోసం త్యాగం.. బలవంతంగా ఆ పని చేయాల్సి వచ్చిందా?

Latest Videos

click me!