`కూలీ`లో సర్‌ప్రైజింగ్‌ స్టార్‌ అతనేనా.. రజనీ, నాగార్జున సినిమాని తప్పక చూడ్డానికి 5 కారణాలు

Published : Aug 13, 2025, 02:01 PM IST

`కూలీ` సినిమాలో ఓ స్టార్‌ హీరో మెరవబోతున్నారట. ఆయన ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ సినిమా తప్పక చూసేందుకు ఐదు కారణాలను తెలుసుకుందాం.

PREV
16
భారీ హైప్‌తో రిలీజ్‌ కాబోతున్న `కూలీ`

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందిన `కూలీ` సినిమా మరికొన్ని గంటల్లోనే(ఆగస్ట్ 14న విడుదల) ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. నాగార్జున, అమీర్‌ఖాన్‌, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, శృతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి వారు కలిసి నటించిన మూవీ కావడంతో కామన్‌గానే హైప్‌ భారీగా ఉంది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం మరింతగా అంచనాలను పెంచుతుంది. అయితే ఇందులో ఓ సర్‌ప్రైజ్‌ స్టార్‌ కనిపిస్తారని, ఆయన ఓ సర్‌ప్రైజింగ్‌ ఎంట్రీ ఉంటుందని కోలీవుడ్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

DID YOU KNOW ?
అమీర్‌తో రజనీ
రజనీకాంత్‌, అమీర్‌ ఖాన్‌ కలిసి నటించిన తొలి చిత్రం `కూలీ`. అదే సమయంలో తమిళంలో అమీర్‌ నటించిన మొదటి సినిమా కూడా ఇదే.
26
`కూలీ`లో సర్‌ప్రైజ్‌ స్టార్‌ అతనే

అయితే మొన్నటి వరకు `విక్రమ్‌` ఫేమ్‌ కమల్‌హాసన్‌ కనిపిస్తారని అన్నారు. ట్రైలర్‌ ని డీ కోడ్‌ చేస్తే కొన్ని సీన్లు `విక్రమ్‌` మూవీలోని సీన్లకి దగ్గరగా ఉండటంతో కమల్‌ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు కొత్త పేరు తెరపైకి వచ్చింది. మరో స్టార్‌ హీరో కనిపిస్తారట. లోకేష్‌ కనగరాజ్‌కి `ఎల్‌సియూ`కి సంబంధం లేని స్టార్‌ కనిపించబోతున్నట్టు సమాచారం. ఆయన ఎవరో కాదు శివకార్తికేయన్‌. ఇటీవల `అమరన్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు శివకార్తికేయన్‌. ఆయనకు లోకేష్‌ మంచి స్నేహితుడు. దీంతో ఇందులో చిన్న క్యామియోలో కనిపిస్తారని టాక్‌. అయితే గతేడాది `అమరన్‌` సినిమా ప్రమోషన్స్ సమయంలో దీనిపై శివ కార్తికేయన్ స్పందిస్తూ, ఈ మూవీ షూటింగ్‌ తన ఇంటి ముందు జరిగిందట. లోకేష్‌ని, తలైవర్‌(రజనీని) కలవడానికి, కాసేపు రిలాక్స్ కోసం వెళ్లినట్టు తెలిపారు. ఇందులో నటించడం లేదు అన్నారు. కానీ ఇటీవల తమిళ మీడియాలో మాత్రం ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు ఓవర్సీస్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సందు కూడా ఈ విషయాన్ని వెల్లడించడంతో ఆ స్టార్‌ శివకార్తికేయన్‌ అని అంతా బలంగా నమ్ముతున్నారు. ఇందులో నిజం ఏంటనేది కొన్ని గంటల్లో తేలనుంది.

36
`కూలీ` సినిమా చూడ్డానికి ఐదు కారణాలు

ఇదిలా ఉంటే `కూలీ` సినిమా చూడ్డానికి ఐదు ప్రధానకారణాలు చూస్తే. 1. రజనీకాంత్‌. ఈ ఏజ్‌లోనూ ఆయన ఎనర్జీ, ఆయన స్టయిల్‌ కోసం చూడొచ్చు. అంతేకాదు యాక్షన్‌లో రజనీ ఏ రేంజ్‌లో రెచ్చిపోతారో `జైలర్‌`లో చూశాం. ఇందులో దాన్ని మించి ఉంటుందని లోకేష్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సూపర్‌ స్టార్‌ ఆడియెన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారట. కాబట్టి ఈ మూవీ చూడాల్సి వస్తే ఆయన కోసమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

46
మొదటిసారి విలన్‌గా నాగార్జున

2. నాగార్జున, ఇతర కాస్టింగ్‌. ఇందులో మన తెలుగు స్టార్‌ నాగార్జున నటిస్తుండటం ఓ విశేషమైతే, ఆయన మొదటి సారి విలన్‌గా చేస్తుండటం మరో కారణం. రజనీకాంత్‌కి ఈక్వల్‌గా ఉండే రోల్‌ అని నాగ్‌ తెలిపారు. అంటే వెండితెరపై రజనీ, నాగ్‌ల మధ్య వార్‌ వేరే లెవల్‌ లో ఉండబోతుందని చెప్పొచ్చు. వీరితోపాటు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ నటించడం మరో విశేషం. ఆయన సినిమా చేశారంటే కథలో అంత దమ్ముండాలి. `కూలీ`లో ఆ స్టఫ్‌ పుష్కలంగా ఉందని అర్థమవుతుంది. వీరితోపాటు ఉపేంద్ర, శృతి హాసన్‌లు కూడా ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్టర్‌గా చెప్పొచ్చు.

56
లోకేష్‌ కనగరాజ్‌ మార్క్ కంటెంట్‌

3.లోకేష్‌ కనగరాజ్‌. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలేవి ఫ్లాప్‌ కాలేదు. అదే సమయంలో దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్ ని క్రియేట్‌ చేశారు. తాను తీసే ప్రతి సినిమాకి ఒక లింక్‌ పెడుతూ వస్తున్నారు. సినిమాలపై హైప్‌క్రియేట్‌ చేస్తున్నారు. అదే సమయంలో ఆయన నుంచి వచ్చే సినిమాలు మినిమమ్‌ గ్యారంటీ అని, వాహ్‌ ఫ్యాక్టర్స్ అదిరిపోతాయని, యాక్షన్‌ సీన్లకి కొదవ ఉండదని, ఎంగేజింగ్‌ ఎలిమెంట్లు ఎక్కువగా ఉంటాయనేది ఆడియెన్స్ లో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూడ్డానికి లోకేష్‌ పేరు ఒక బ్రాండ్‌గా మారితే. ఈసారి రజనీకాంత్‌ని డైరెక్ట్ చేయడం ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించే అంశంగా చెప్పొచ్చు.

66
అనిరుథ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌

4. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుథ్ రవిచందర్‌. ఆయన మ్యూజిక్‌ చేశాడంటే సినిమా అదిరిపోతుందనే టాక్‌ ఉంది. ఇక బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. రజనీకాంత్‌కి అనిరుథ్‌ మ్యూజిక్‌ తోడైతే సినిమా వేరే లెవల్‌ అని, ఎలివేషన్లకి కొదవ ఉండదని, ఆయా సీన్లు వచ్చినప్పుడు థియేటర్లలో ఆడియెన్స్ కూర్చోలేరు అంటారు. ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. 

ఇక ఫైనల్‌గా 5. స్టోరీ. లోకేష్‌ సినిమాల్లో బలమైన స్టోరీ ఉంటుంది. అదే సమయంలో సమాజాన్ని పట్టిపీడుస్తున్న అంశాలను కథా వస్తువుగా తెరకెక్కిస్తుంటారు. స్కామ్‌లను బయటపెడుతుంటారు. ఇందులో గోల్డ్ వాచ్‌ల మాఫియా గురించి చూపించబోతున్నారట. దీనికితోడు పూజ హెగ్డే నర్తించిన `మోనికా` సాంగ్‌ కూడా ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్టర్‌గా చెప్పొచ్చు. ఇవన్నీ `కూలీ` సినిమాని ఎంగేజ్‌ చేసే అంశాలుగా చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories