రెస్టారెంట్ స్టార్ట్ చేసి, ముంబయ్ లో సెటిల్ అయిన తెలుగు సీరియల్ హీరో

Published : Aug 13, 2025, 12:29 PM IST

తెలుగు సీరియల్స్ లో హీరోగా గుర్తింపు సాధించి, తెలుగు బిగ్ బాస్ లో సందడి చేసిన నటుడు, ప్రస్తుతం ముంబయ్ లో రెస్టారెట్ ఓపెన్ చేసిన బిజీ అయిపోయాడు. అక్కడే సెటిల్ అయ్యాడని టాక్. మరి ఎవరా బుల్లితెర హీరో. 

PREV
16

టెలివిజన్ నుండి సినిమాల వరకూ ప్రయాణం సాగించిన బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా, ఇప్పుడు బిజినెస్ రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలుచోట్ల కనిపించిన అలీ, ఇటీవల సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ముంబైలో రెస్టారెంట్ వ్యాపారంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

26

అలీ రెజా ఓ టైమ్ లో టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ లో పాల్గొని మరింత పాపులారిటీ అందుకున్నాడు. అటుపై పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. జనతా గ్యారేజ్ లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకడిగా నటించాడు అలీ రైజా. కాగా గత కొంతకాలంగా ఆయన టీవీ షోలలో కానీ, సినిమా ఈవెంట్స్‌లో కానీ కనిపించకపోవడం అభిమానుల్లో ఆసక్తిని రేపింది.

36

ఇటీవల యాంకర్ రవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అలీ రెజా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. "అలీ రెజా బాంబేలో రెస్టారెంట్ పెట్టాడు. చాలా బిజీ అయిపోయాడు. ఇప్పుడు కలవడమే కష్టం. ఒకప్పుడు రెండు ఫ్యామిలీలు రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. నా కూతురు, అలీ రెజా కూతురు కూడా చాలా క్లోజ్," అని తెలిపారు.

46

అలీ రెజా, ముంబైలో మరొక భాగస్వామితో కలిసి ‘అఫ్జల్స్ మావో (Afzal's Mao)’ అనే రెస్టారెంట్‌ ను ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్ కు ముంబైలో మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఐదు బ్రాంచులు ప్రారంభించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఫుడ్ అవార్డ్స్‌ లో కూడా ఈ రెస్టారెంట్‌ కి గుర్తింపు లభించింది.

56

ప్రస్తుతం అలీ రెజా తన కుటుంబంతో కలిసి ముంబైలోనే స్థిరపడిపోయినట్టు తెలుస్తోంది. ఆయన నటనను అభిమానించే వారు బుల్లితెరపై మళ్లీ కనిపించే అవకాశం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. సినిమాలకైనా, వెబ్ ప్రాజెక్టులకైనా అవకాశాలుంటే మాత్రం అలీ రెజా హైదరాబాద్‌ వచ్చి షూటింగ్‌లు పూర్తి చేసి తిరిగి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.

66

అలీ రెజా సినీ ప్రయాణం కొనసాగుతుందో లేదో స్పష్టత లేకపోయినా, ఆయన బిజినెస్ విజయవంతంగా సాగుతుండటంతో ఫుల్ బిజీ అయిపోయాడు బుల్లితెర హీరో. ప్రస్తుతం బిజినెస్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న అలీ రెజా, నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తాడా అని చూస్తున్నారు అభిమానులు.

Read more Photos on
click me!

Recommended Stories