అన్నపూర్ణమ్మ చనిపోయినప్పుడు కాదు, ఏఎన్నార్‌ ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? నాగార్జున హీరో ఎంట్రీ వెనుక అంత బాధ ఉందా

First Published | Nov 15, 2024, 5:37 PM IST

నాగార్జున హీరో ఎలా అయ్యాడో తెలుసా? అసలు ఆయనకు ఆ ఆలోచన ఉందా? దీనికి అన్న వెంకట్‌కి కారణమేంటి? నాగ్‌ నిర్ణయం చెప్పినప్పుడు ఏఎన్నార్‌ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు?
 

అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్‌. ఎన్టీఆర్‌ కి దీటుగా సినిమాలు చేసి మెప్పించాడు. ఆయనతో పోటీ పడ్డాడు, కలిసి చేశాడు. నటుడిగానూ, ఇమేజ్‌ పరంగానూ ఆయనకు పోటీ ఇచ్చాడు. తెలుగు సినిమాకి రెండు కళ్లలో ఒకరిగా ఉన్నారు. ఏఎన్నార్‌ నటుడిగానే కాదు, నిర్మాతగా, స్టూడియో హోనర్‌గా ఎదిగారు. ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో నిలబడ్డారు. పెద్ద వ్యవస్థనే క్రియేట్‌ చేశారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

సాధారణంగా ఆ స్థాయిలో ఉన్నప్పుడు తన వారసులను సినిమాల్లోకి తీసుకురావాలని ఉంటుంది. కానీ అక్కినేని మాత్రం ఎప్పుడూ అది కోరుకోలేదట. ఏనాడూ నాగార్జునని సినిమాలు చేయాలని కోరలేదట. అది నాగార్జున ఇష్టంతోనే సాధ్యమయ్యిందట. నాగ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ చేసేందుకు ఫారెన్‌ వెళ్లాడు.

అలా జాబ్‌గానీ, బిజినెస్‌ వైపుగానీ వెళ్లే ఆలోచన ఉండేదట. సినిమాల్లోకి రావాలని తాను కూడా ఎప్పుడూ అనుకోలేదు. మెకానికల్‌ ఇంజనీర్‌ అయిపోయిన తర్వాత ఇండియా వచ్చాడు. ఏం చేయాలనేది పెద్ద డైలామా నడుస్తుంది. ఈ క్రమంలో ఏఎన్నార్‌ సినిమాలు నిర్మిస్తున్నారు. అన్న వెంకట్‌ ఆ ప్రొడక్షన్స్ చూసుకుంటున్నారు. నాగ్‌ కూడా వాటిలో ఇన్‌వాల్వ్ అయ్యారు. 
 


Nagarjuna

అయితే ప్రొడక్షన్‌ పెంచాలనుకున్నారు. హీరోలు, దర్శకులను అడిగితే ఎవరూ చేయలేదట. వీళ్లేంటి చిన్నపిల్లలు సినిమాలు ఏం నిర్మిస్తారు లే అనుకున్నారట. లైట్‌ తీసుకున్నారట. చాలా రోజులవుతుంది. ఒక్క సినిమా కూడా సెట్‌ కాలేదు. దీంతో అనుకోకుండా ఓ రోజు రాత్రి వెంకట్‌ తన మనసులో మాట బయటపెట్టాడు. నువ్వు(నాగ్‌ని పట్టుకుని) సినిమా చేస్తావా అని అడిగాడట.

నాగార్జునలో పెద్ద టెన్షన్‌. నేను సినిమాలు చేయగలనా అని అనుకున్నాడట. కానీ భయంగానే ఒప్పుకున్నాడు. ఇదే విషయాన్ని నాన్న ఏఎన్నార్‌కి చెప్పారు. తాను సినిమాలు చేయాలనుకుంటున్నట్టు వెల్లడించగానే ఒక్కసారిగా ఏఎన్నార్‌ కన్నీళ్లు పెట్టుకున్నారట. 
 

నాగ్‌ని చూడకుండా పక్కకు తిరిగి కన్నీళ్లు తూడుచుకున్నాడట. నాన్న కన్నీళ్లు పెట్టుకోవడం అది రెండో సారి అని, అమ్మ(అన్నపూర్ణమ్మ) చనిపోయినప్పుడు నాన్నని ఏడవడం చూశాను. ఆ తర్వాత నా నిర్ణయం చెప్పినప్పుడు ఆయనలో కన్నీళ్లు చూశాను అని తెలిపారు‌. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఓ వ్యవస్థని నిర్మించారు.

స్టూడియో, ప్రొడక్షన్‌ నిర్మించారు. ఒక్క హీరో లేరు కదా, తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేవారు లేదు అనే బాధ తనలో ఉండిపోయిందట. కానీ ఆ విషయం చెప్పలేదని, తన మనసులోనే ఆ బాధ దాచుకుని, ఎంతో ఒత్తిడి ఫీలయ్యారని, తాను చెప్పిన ఆ మాటతో ఆయన ఆ బాధ అంతా పోయిందని లోలోపల ఎంతో సంతోషించారని తెలిపారు నాగ్‌. 
 

అయితే తనకు మాత్రం ఆ సమయంలోనే వాస్తవాలు చెప్పారు. నాగేశ్వరరావు కొడుకు అని చెప్పి ఎవరూ సినిమాలు చూడరు, నువ్వు నిరూపించుకుంటేనే, బాగా నటిస్తేనే ఆదరణ ఉంటుందని, మంచి సినిమాలు చేస్తేనే ఆదరిస్తారని, నీ వద్ద టాలెంట్‌ ఉంటేనే రాణించగలవు అని ముందే హెచ్చరించారట. దీంతో తాను సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు నాగార్జున.

1986లో `విక్రమ్‌` సినిమాతో ఆయన హీరోగా వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే మొదట ఏడెనిమిది సినిమాల వరకు ఒక్కటి కూడా తనకు పేరు తీసుకురాలేదని. మూడు నాలుగు సినిమాలు పెద్దగా ఆడలేదని, కొన్ని హిట్‌ అయినా తనకు పేరు రాలేదని, దర్శకుడు బాగా చేశాడని, హీరోయిన్‌ బాగా చేసిందని వాళ్ల గురించి చెబుతున్నారు తప్ప తన గురించి ఎవరూ చెప్పడం లేదని ఎంతో బాధపడ్డారట నాగ్‌. 
 

ఇలా కాదని చెప్పి మణిరత్నం వెంటపడినట్టు చెప్పారు. పది రోజులపాటు మణిరత్నం ఇంటి గుమ్మ వద్దే నిలబడ్డానని, అలా పది రోజుల తర్వాత చేస్తానని చెప్పి, నెల రోజుల తర్వాత కథ చెప్పారని, కేవలం 32 రోజుల్లోనే `గీతాంజలి` సినిమా చేసినట్టు తెలిపారు. అది తన కెరీర్‌ని మలుపు తిప్పిందన్నారు నాగ్‌. అలా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి నుంచి నటుడిగా నిరూపించుకుని మెప్పించాడు.

టాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన విలక్షణ పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మల్టీస్టారర్స్ చేస్తున్నారు. `కుబేర`లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే రజనీకాంత్‌ `కూలీ`లో నెగటివ్‌ రోల్‌  చేస్తున్నారు నాగ్‌. 

Read more:గంగవ్వ ఎలిమినేషన్‌లో సంచలన నిజాలు, అంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగిందా?

also read: నాగచైతన్య, సిద్ధార్థ కాదు.. సమంత ఫస్ట్ క్రష్‌ ఎవరో తెలుసా? రెండేళ్లు వెంటపడ్డాడు, తీరా అడిగితే
 

Latest Videos

click me!