జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదట...? ఇంతకీ ఏంటా కోరిక..?

Published : May 22, 2022, 11:37 AM ISTUpdated : May 22, 2022, 11:40 AM IST

నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ లో టాప్ స్టార్ గా వెలుగొందుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. స్టార్ డమ్, మనీ, హ్యాపీ ఫ్యామిలీ అన్నీ ఉన్నా. తారక్ జీవితంలో ఆ లోటు మాత్రం తప్పలేదట. ఇంతకీ ఎన్టీఆర్ జీవితంలో తీరని ఆ కోరిక ఏంటీ..?   

PREV
18
జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదట...? ఇంతకీ ఏంటా కోరిక..?

పెద్దాయన తరువాత ఆయన నట వారసత్వాన్ని బాలకృష్ణ నిలబెట్టాడు, బాలయ్య తరువాత నందమూరి కీర్తిని జూనియర్ ఎన్టీఆర్ తారా స్థాయికి తీసుకెళ్తున్నాడు. హీరోగా టాలీవుడ్ లో స్టార్ డమ్ తో  పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది ఎన్టీఆర్ కు. తాతకు దగ్గ మనవడిగా దూసుకెళ్తున్నాడు హీరో. 
 

28

ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా.. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఇమేజ్ సాధించాడు ఎన్టీఆర్. యాక్టింగ్ లో తనదైన స్టైల్ తో.. అద్భుతమైన నటనతో దూసుకుపోతున్న తారక్..  హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. 
 

38

సినిమా, స్టార్ డమ్, బారీరెమ్యూనరేషన్ తో పాటు హ్యాపీ ఫ్యామిలీ ఇంకే కావాలి.. అన్నీ ఉన్నా తారక్ ను మాత్రం ఓ లోటు వెంటాడుతోందట. జీవితంలో ఆయన అనుకున్న ఒక్క కోరక మాత్రం తీరలేదట.  ఆ ఒక్క విషయంలోనే  ఎన్టీఆర్ కు అసంతృప్లి ఉందట. 
 

48

ఓ వైపు సినిమాకు ప్రాధాన్యతని ఇస్తూ.. మరోవైపు కుటుంబాన్ని కూడా సమర్ధవంతంగా నిర్వహించుకుంటారు ఎన్టీఆర్.  ఇండస్ట్రీలోకి వచ్చి నప్పటి నుంచి అంచలంచెలుగా ఎదిగిన ఎన్టీఆర్ .. పట్టుదలకు, కృషి. హార్డ్ వర్క్ విషయంలో ఇతర హీరోకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

58

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తారక్ తన ఫామిలీ తో కూడా టైం స్పెండ్ చేస్తూనే ఉంటాడు. ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతితో వివాహం జరిగివీరికి ఇద్దరు కొడుకులతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో టైమ్ స్పెండ్ చేస్తూ.. సోషల్ మీడియలో ఫోటోలు కూడా పెడుతుంటారు. 

68

అయితే ఎంత సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నా.. ఎన్టీఆర్ కు ఓ తీరని కోరిక మిగిలిపోయిందట. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి రెండవ సారి ప్రెగ్నెంట్ అయినప్పుడు తప్పకుండా ఆడపిల్ల పుడుతుందని అనుకున్నారట తారక్. అలా ఆడపిల్ల పుడితే నందమూరి వంశానికి ఆడపడచు వస్తుందని ఎన్టీఆర్ చాలా ఆశపడ్డారట. 

78

సహజంగానే ఆడవారంటే గౌరవ మర్యాదలు కలిగి ఉన్న ఎన్టీఆర్ తనకో కూతురు పుడితే బాగుంటుందని అనుకున్నారట. కానీ, రెండవసారి కూడా అబ్బాయే పుట్టాడు. అయితే ఎవరైనా సంతోషమే కాని.. ఆడపిల్ల పుట్టి ఉంటే కొడుకు, కూతురితో ఫ్యామిలీ ఫుల్ పీల్ అయ్యేది అని ఆలోచించారట తారక్. 

88

ఇక రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ తో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివతో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడు, ఈ ఏడాది చివర్లో ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు తారక్. వరుసగా సినిమాలు లైన్ అప్ చేస్తున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories