Payal Rajput: వేదికపైనే లిప్ లాక్ తో రెచ్చిపోయారు.. పాయల్ రాజ్ పుత్ సిగ్గు పడింది కానీ తగ్గలేదుగా 

First Published May 22, 2022, 10:46 AM IST

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. 

RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో Payal Rajput కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ పాయల్ రాజ్ పుత్ కి టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ మంచు విష్ణు సరసన 'గాలి నాగేశ్వరరావు' అనే చిత్రంలో నటిస్తోంది. 

ఇక అవకాశం చిన్నినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్ తన గ్లామర్ బయట పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న జీ మహోత్సవం కార్యక్రమాల్లో పాయల్ రాజ్ పుత్ డాన్స్ పెర్ఫామెన్స్ తో అలరిస్తోంది. తాజాగా పాయల్ రాజ్ పుత్ తన ప్రియుడు సౌరభ్ దింగ్రతో కలసి వేదికపై రొమాంటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ ఎపిసోడ్ నేటి సాయంత్రం ప్రసారం కానుంది. 

తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో పాయల్, సౌరభ్ కెమిస్ట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. పాయల్ రాజ్ పుత్ మరో అడుగు ముందుకేసి అందరికి షాక్ ఇచ్చింది. వేదికపైనే తన ప్రియుడికి పాయల్ రాజ్ పుత్ లిప్ లాక్ కిస్సు ఇచ్చేసింది. 

ఇక ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి కాసేపు వీళ్ళిద్దరితో ఆడుకుంది. పాయల్ రాజ్ పుత్ తన మేడలో బేబీ అని ఉన్న నెక్ లెస్ ధరించింది. దీనితో శ్రీముఖి.. మీ ఇద్దరి సీక్రెట్ నాకు తెలిసిపోయింది. తాను మిమ్మల్ని బేబీ అని పిలుస్తాడు.. అందుకే కదా ఈ నెక్ లెస్ ధరించారు అని అడగగా... పాయల్ రాజ్ పుత్ ముఖంలో సిగ్గు మొగ్గలేసింది. 

ప్రస్తుతం వీరిద్దరూ డీప్ ఎఫైర్ లో ఉన్నారు. మరి పెళ్లి న్యూస్ ఎప్పుడు చెబుతారో అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ తన ప్రియుడితో చేసిన బోల్డ్ ఫోటో షూట్స్ గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

click me!