`ఎస్‌ఎస్‌ఎంబీ29`లో మహేష్‌తోపాటు కలిసి నటించే స్టార్‌ హీరో ఫిక్స్?.. జక్కన్న మామూలోడు కాదుగా!

First Published | Feb 29, 2024, 6:59 AM IST

మహేష్‌ బాబు సినిమా స్థాయిని నెమ్మదిగా పెంచే ప్లాన్‌లో ఉన్నారు రాజమౌళి. ఒక్కో స్టార్‌ కాస్ట్ ని దించుతున్నాడు. ఇప్పుడు మరో స్టార్‌ హీరోని ఫిక్స్ చేశాడట. 
 

`బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత రాజమౌళి నుంచి మరో భారీ సినిమా రాబోతుంది. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. సినిమా నిత్యం వార్తల్లో నిలిచేలా చేస్తుంది. అంతేకాదు సినిమా రేంజ్‌ని పెంచుతుంది. ఇప్పటికే రాజమౌళి దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. 
 

కాస్టింగ్‌ వైజ్‌గా ఇందులో అంతర్జాతీయ ఆర్టిస్ట్ లు ఉంటారని అంటున్నారు. అలాగే టెక్నీషియన్లు కూడా యాడ్‌ కాబోతున్నారట. మరోవైపు బడ్జెట్‌ సుమారు వెయ్యి కోట్లతో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇందులో మహేష్‌ బాబు ఒక్కరే ఫైనల్‌ అయ్యారు. ఇతర కాస్టింగ్‌ ని ఎంపిక చేసే పనిలో రాజమౌళి ఉన్నాయి. అయితే వినిపించే వార్తల ప్రకారం ఇండోనేషియా నటి, బాలీవుడ్‌ నటి  కనిపిస్తారట. 
 


ఇండోనేషియాకి చెందిన చెల్సియా ఇస్లాన్‌ హీరోయిన్‌గా ఎంపికైందట. ఆమె మహేష్‌కి జోడీగా చేస్తుందని సమాచారం. ఆమెతోపాటు బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనెని కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఆమె ఎవరికి పెయిర్‌ అనేది ఆసక్తికరం. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ కాస్ట్ నేమ్‌ తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌ స్టార్‌ హీరో మరో హీరోగా కనిపిస్తారని అంటున్నారు. 
 

ఆయన ఎవరో కాదు కింగ్‌ నాగార్జున. ఇప్పటికే ఆయన పేరు తెరపైకి వచ్చింది. మహేష్‌ `ఎస్‌ఎస్‌ఎంబీ29`లో నాగార్జున కనిపించబోతున్నట్టు పుకార్లువినిపించాయి. అయితే ఇప్పుడు నాగ్‌ ఫైనల్‌ అయినట్టు తెలుస్తుంది. ఇదే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో, అటు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. అయనకు జోడీగా దీపికా పదుకొనె కనిపిస్తారని అంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. 

Sithara

ఇదిలా ఉంటే ఇటీవల మహేష్‌ బాబుతోపాటు మరో ముగ్గురు హీరోలు కనిపిస్తారని వార్తలు వైరల్‌ అయ్యాయి. గెస్ట్ రోల్స్ లో వాళ్లు సందడి చేయబోతున్నారట. మరి మిగిలిన ఇద్దరు ఎవరనేది సస్పెన్స్. ఇక ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్‌ మూవీగా ఇండియానా జోన్స్ స్టయిల్‌లో ఈ సినిమాని తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారట. మహేష్‌ ఓ సాహసికుడిగా కనిపిస్తాడట. ఆ మేకోవర్ కోసం ఇప్పటికే మహేష్‌ బాబు వర్కౌట్స్ స్టార్ట్ చేశాడు. అందులో బిజీగా ఉన్నారు. 

`ఎస్‌ఎస్‌ఎంబీ29` సినిమా ప్రకటన త్వరలోనే ఉండబోతుందట. అంతర్జాతీయ వేదికపై, అంతర్జాతీయ మీడియా ముందు దీన్ని అనౌన్స్ చేయబోతున్నారట. దీనికి హాలీవుడ్‌ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్‌, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్ లను ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ మూవీకి `మహారాజా`, `చక్రవర్తి`అనే పేర్లని పరిశీలిస్తున్నారట. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించబోతున్నారు. పీఎస్‌ వినోద్‌ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, మోహన్‌ నాథ్‌ బింగిని ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, కమల్‌ కన్నన్‌ టీమ్‌ వీఎఫ్‌ఎక్స్ వర్క్ చూసుకోబోతుందని సమాచారం. కె ఎల్‌ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

Latest Videos

click me!