వయసు పెరిగిపోతుంది, పేరెంట్స్ ప్రెజర్‌.. పెళ్లిపై శ్రీముఖి క్రేజీ రియాక్షన్‌..

Published : Feb 28, 2024, 10:28 PM ISTUpdated : Feb 28, 2024, 10:30 PM IST

స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరని ఊపేస్తుంది. ఆమె ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉంది. ఆయన పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. తాజాగా దీనిపై స్పందించింది.   

PREV
16
వయసు పెరిగిపోతుంది, పేరెంట్స్ ప్రెజర్‌.. పెళ్లిపై శ్రీముఖి క్రేజీ రియాక్షన్‌..
Sreemukhi

యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు తెలుగు బుల్లితెర యాంకర్లలో అత్యంత బిజీగా ఉన్న యాంకర్‌. ఒకప్పుడు ఒకటి అర షోస్‌తో కెరీర్‌ నెట్టుకొచ్చిన శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరని దున్నేసే స్థాయికి ఎదిగింది. ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు స్పెషల్‌ షోస్‌తో రచ్చ లేపుతుంది. చలాకీతనంతో, చురుకుతనంతో ఆకట్టుకుంటుంది. అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. అభినయంతో అలరిస్తుంది. 
 

26
Sreemukhi

శ్రీముఖి ప్రస్తుతం మూడు పదులు దాటింది. నాలుగు పదుల్లోకి వెళ్తుంది. ఏజ్‌ పెరుగుతుంది, వయసు ముదిరిపోతుంది. అయినా పెళ్లి చేసుకోవడం లేదు. కెరీర్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో మ్యారేజ్‌ ఆలోచనే చేయడం లేదు. గతంలో లవర్‌ ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. బ్రేకప్‌ అయ్యిందని కూడా ఓ షోలో చెప్పింది. కానీ అవన్నీ సరదాగా చెప్పిందా, నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. 
 

36

ఇటీవల బుల్లితెర భామలు పెళ్లిలు చేసుకుంటున్నారు. సినిమా హీరోయిన్లు మ్యారేజ్‌లు చేసుకుంటున్నారు. కానీ శ్రీముఖి మ్యారేజ్‌ గురించి మాట్లాడటం లేదు. తాజాగా ఆమెకి పెళ్లి ప్రశ్న ఎదురయ్యింది. ఓ రిపోర్టర్‌ పెళ్లిపై క్లారిటీ ఇవ్వాలని అడగ్గా శ్రీముఖి ఓపెన్‌ అయ్యింది. పెళ్లి గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 
 

46
Sreemukhi

నాకు వయసు పెరుగుతూనే ఉంది, పెళ్లి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంట్లో పేరెంట్స్ ప్రెజర్‌ ఉందని అంటున్నారు. కానీ పేరెంట్స్ నుంచి నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. వాళ్లు పెళ్లి గురించి చెప్పింది ఒక్కటే, నువ్వు షోస్‌ చేస్తున్నావు, నీ రంగంలో నువ్వు ముందుకు వెళ్తున్నావు, అలానే వెళ్లు, నీకు చేసుకోవాలనిపించినప్పుడు చేసుకో, మేం బలవంత పెట్టం` అని చెప్పారు. తనకు మ్యారేజ్‌ విషయంలో ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారని తెలిపారు. 
 

56

ప్రస్తుతం తాను మంచి షోస్‌ చేస్తున్నానని, యాంకర్‌గా బిజీగా ఉన్నానని, ఇప్పుడైతే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు. `నేను ఎంత లౌడ్‌ స్పీకరో మీకు తెలుసు కాబట్టి. నా పెళ్లి అనే వార్త రెడీగా ఉందనప్పుడు అంతే లౌడ్‌గా ప్రకటిస్తాను` అని వెల్లడించింది శ్రీముఖి. ప్రస్తుతానికి మాత్రం పెళ్లి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది శ్రీముఖి. 
 

66

శ్రీముఖి యాంకర్‌గా సూపర్‌ సింగర్ 3, సారంగ దరియా, మిస్టర్ అండ్‌ మిసెస్‌`, `ఆదివారం స్టార్‌ మా పరివారం` షోస్‌తో బిజీగా ఉంది శ్రీముఖి. మరోవైపు అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తుంది. చివరగా ఆమె చిరంజీవితో `భోళాశంకర్‌`లో నటించింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories