ముద్దు సీన్ కోసం మూడు రోజుల షూటింగ్, హీరోయిన్ తల్లి ముందే రొమాన్స్ చేసిన స్టార్ హీరో ఎవరు..?

First Published | Nov 16, 2024, 7:43 PM IST

ముద్దు సీన్ కోస మూడు రోజులు షూటింగ్ చేసేలా చేశాడట స్టార్ హీరో..ఆ ఒక్క సీన్ కోసంమే ఇంత చేసిన ఆ స్టార్ హీరో ఎవరు..? ఎదుకలా జరిగింది ఇంతకీ విషయం ఏంటీ.? ఆ సినిమా ఏంటి..? చూద్దాం. 


ఫిల్మ్ ఇండస్ట్రీలో  ప్రేమ‌క‌థలకు  కొద‌వ లేదు. ఎన్నో ప్రేమ‌క‌థ‌లు సినిమాలుగా మారి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో పేరుపొందాయి.  దేశ‌వ్యాప్తంగా  సినీ ప్రేమికుల మ‌దిని దోచుకున్నాయి. అంతే కాదు ఈ ప్రేమకథల్లో రొమాన్స్ కూడా ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు.. ప్రేమికుల మనసుల్లో గిలిగింతలు పెట్టింది. 

అయితే ఇప్పటి సినిమాల్లో ముద్దు సీన్లు చాలా కామన్ అయిపోయాయి. తెలుగులో కూడా ఈ విధానం చాలా కాలంగా కనిపిస్తుంది. కాని బాలీవుడ్ లో మాత్రం ఎప్పటి నుంచో ముద్దు సీన్లు, ఘాటు రొమాంటిక్ సీన్లు కామన్ గా వస్తున్నాయి. అంతే కాదు ఇలాంటి సీన్ల కోసం చాలా టైమ్ తీసుకుని రీ టేక్ లు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో అటువంటి సంఘటననే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

AlSo Read: స్టార్ డైరెక్టర్, రెండు బ్లాక్ బస్టర్ మూవీస్, రిజెక్ట్ చేసిన మహేష్ బాబు, ఏంటా సినిమా, ఎవరా దర్శకుడు..?

ఒక్క ముద్దు సీన్ కోసం దాదాపు మూడు రోజులు షూటింగ్ చేశాడట ఓ స్టార్ హీరో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. ఆమీర్ ఖాన్. ఆ హీరోయిన్ కూడా ఎవరో తెలుసా..? కరిష్మా కపూర్. దేశం మెచ్చిన ప్రేమ కథ సినిమాల్లో రాజా హిందుస్తానీ ఒక‌టి. అమీర్‌ఖాన్ – క‌రిష్మా క‌పూర్ జంట‌గా తెరకెక్కిన  ఈ సినిమాకు ధ‌ర్మేష్ ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

AlSo Read:ఓ హీరోయిన్ కోసం ఏకంగా 150 పాటలు పాడిన గాయని సుశీల


దాదాపు 28 ఏళ్ళ క్రితం అంటే  1996లో రిలీజ్ అయిన ఈ ప్రేమ కావ్యం.. బాలీవుడ్‌ కు మాత్రమే పరిమితం అవ్వకుండా దేశం మొత్తాన్ని ఉర్రూత‌లూగించేసింది. తాజాగా ఈ సినిమా 28 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా సినిమా ద‌ర్శ‌కుడు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

ఈ సినిమా విశేషాలు వెల్లడించిన దర్శకుడు.. ఇందులో ఉన్న  ముద్దు సీను గురించి కూడా ధ‌ర్మేష్ ద‌ర్శ‌న్ చెప్పాడు. సినిమా క‌థలో భాగంగా ఓ ముద్దు సీన్ ఉందని.. క‌రిష్మా అప్ప‌ట‌కి ఏ సినిమాలోనూ కిస్ సీన్లో చేయ‌లేదు. అందుకే ఆమె చాలా టేక్‌లు తీసుకుంది. క‌రిష్మాకు ధైర్యం చెప్పేందుకు ఆమె త‌ల్లిని కూడా షూటింగ్ స్పాట్‌కు తీసుకువ‌చ్చి ధైర్యం చెప్పేలా చేశాము.. మొత్తం మూడు రోజుల పాటు షూట్ చేసి 47 రీ టేక్‌లు తీసుకున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

ఆ రోజుల్లో లిప్‌లాక్ సీన్లు చాలా అరుదు… సినిమా రిలీజ్ అయ్యాక ఆ లిప్ కిస్ సీన్ ఓ ఐకానిక్‌గా నిలిచింది. ఇదే ముద్దు సీన్‌పై గ‌తంలో ఓ సారి క‌రిష్మా మాట్లాడుతూ ఆ టైంలో తాను ఎంతో అసౌక‌ర్యంగా ఫీల్ అయ్యాన‌ని. ఆ సీన్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూశాన‌ని తెలిపారు. 

ఓ పేదింటి కుర్రాడు.. ధ‌న‌వంతుల అమ్మాయి ప్రేమ‌లో ప‌డ‌డం… వారు పెద్ద‌ల‌ను ఎదిరించి పెళ్లి చేసుకోవ‌డం.. త‌ర్వాత ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌న్న కోణంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ఈ సినిమాను తెలుగులో ప్రేమ‌బంధంగా డ‌బ్ అయ్యింది. ఆ రోజుల్లో రు. 5 కోట్ల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా 76 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టింది.

Latest Videos

click me!