ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నిస్తానని షణ్ముఖ్ తెలిపారు. కాగా షణ్ముఖ్ తో హౌస్ లో మొత్తం 10మంది ఎంట్రీ ఇచ్చినట్లు అయ్యింది. చివరిగా వెళ్లిన ఐదుగురు కంటెస్టెంట్స్ ప్రియా, ప్రియాంక, షణ్ముఖ్, లోబో, జెస్సి మధ్య పకడో పకడో.. టాస్క్ నిర్వహిచారు నాగార్జున. ఈ టాస్క్ నిబంధలకు సంబంధించిన పేపర్ చదవమని షణ్ముఖ్ ని నాగార్జున కోరారు. అయితే ఆ రూల్స్ తెలుగులో ఉండడంతో, నాకు తెలుగు చదవడం రాదని షణ్ముఖ్ ఒప్పుకున్నారు.