ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టికెట్ ధరల గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. కొంతమంది మాత్రమే ఈ సమస్య గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. మిగిలిన స్టార్స్, నిర్మాతలు, దర్శకులు ఆ సాహసం చేయనప్పటికీ లోలోపల మాత్రం చర్చించుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం థియేటర్స్ పై ఆంక్షలు విధిస్తూ టికెట్ ధరల్ని తగ్గించిన సంగతి తెలిసిందే. అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అనేది ప్రభుత్వ వాదన అయితే.. నిర్మాతకు, ప్రేక్షకుడికి లేని సమస్య ప్రభుత్వానికి ఎందుకు అనేది చిత్ర పరిశ్రమ వాదన.