హర్షసాయి కోసం నాలుగు పోలీసు బృందాలు.. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడు ?

First Published | Sep 26, 2024, 2:19 PM IST

మహిళల లైంగిక వేధింపుల వ్యవహారాల్లో రోజుకొక సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది.

మహిళల లైంగిక వేధింపుల వ్యవహారాల్లో రోజుకొక సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. హర్షసాయి మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అతడి ఆడియో కాల్స్ కూడా లీక్ అయినట్లు చెబుతున్నారు. 

హర్ష సాయి తనని ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయి తండ్రిపై కూడా కేసు పెట్టింది. అదే విధంగా తన దగ్గర డబ్బు తీసుకుని కూడా మోసం చేశాడని ఆరోపించింది. అతడి వద్ద నగ్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 


దీనితో హర్ష సాయిపై.. 328, 376, 354 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు నాలుగు పోలీస్ బృందాలు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. 

హర్ష సాయి యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నటుడిగా మారి మెగా అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో సదరు యువతి కూడా నటించింది. ఆమె హర్ష సాయి పై ఫిర్యాదు చేసిన తర్వాత అతడు స్టేట్మెంట్ ఇచ్చాడు. డబ్బు కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోంది అని పేర్కొన్నాడు. ఇదే నిజమైతే హర్ష సాయి ఎందుకు పారిపోయాడు అనే చర్చ జరుగుతోంది. 

Latest Videos

click me!