షాకిస్తున్న స్టార్ డైరెక్టర్ వైఫ్ బిజినెస్ మైండ్.. కేవలం మహిళా వర్కర్లతో కోట్లు, ఇదేం సంపాదన బాబోయ్

First Published | Feb 9, 2024, 12:20 PM IST

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కుమార్తెలలో ప్రీతా విజయ్ కుమార్ ఒకరు. రుక్మిణి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రీతా ఆ తర్వాత క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, మా అన్నయ్య లాంటి చిత్రాల్లో నటించింది.

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కుమార్తెలలో ప్రీతా విజయ్ కుమార్ ఒకరు. రుక్మిణి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రీతా ఆ తర్వాత క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, మా అన్నయ్య లాంటి చిత్రాల్లో నటించింది. 2002 లో ప్రీతా విజయ్ కుమార్ స్టార్ డైరెక్టర్ హరిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రీతా విజయ్ కుమార్ నటనకి గుడ్ బై చెప్పేశారు. 

డైరెక్టర్ హరి సింగం సిరీస్ తో సౌత్ లో పాపులర్ డైరెక్టర్ గా మారారు. డైరెక్టర్ హరి రెమ్యునరేషన్ కోట్లల్లో ఉంటుంది అందులో సందేహం లేదు. అయితే అతడి భార్య ప్రీతా కూడా సంపాదనలో తగ్గడం లేదు. ఈ జంటకి ముగ్గురు కుమారులు సంతానం. ఫ్యామిలీని చూసుకుంటూనే ప్రీతా విజయ్ కుమార్ బిజినెస్ లో రాణిస్తున్నారు. 


భర్తకి పోటీగా ఆమె సంపాదన ఉంటోంది. చూడడానికి ప్రీతా విజయ్ కుమార్ హోమ్లీగా కనిపిస్తారు. కానీ ఆమె బిజినెస్ మైండ్ మాత్రం వేరే లెవల్ అని సన్నిహితులు చెబుతున్నారు. చెన్నైలోని బీచ్ కి దగ్గరగా ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీతా విజయ్ కుమార్ ఒక లగ్జరీ కల్యాణ మండపాన్ని నిర్మించారట. దీనిపేరు ప్రీతా ప్యాలెస్. బీచ్ లొకేషన్ కావడంతో బాగా పాపులర్ అయింది. 

కల్యాణ మండపానికి దగ్గర్లో కేవలం మహిళా వర్కర్లతో కాఫీ హౌస్ ని ఏర్పాటు చేశారు. ఇలా కాఫీ హౌస్ లో తమిళనాడులో పలు బ్రాంచీలు ఉన్నాయట. అదే విధంగా ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియో లు కూడా ఆమె రన్ చేస్తున్నారు. 

వీటన్నింటి ద్వారా ప్రీత విజయ్ కుమార్ కి నెల తిరిగే సరికి లక్షల్లో ఆదాయం వచ్చి పడుతుందని అంటున్నారు. ఏడాదికి కోట్లల్లో ఆమె సంపాదన ఉంటుంది. ఒక వైపు స్టార్ డైరెక్టర్ గా హరి దూసుకుపోతుంటే..అతడి భార్య బిజినెస్ మైండ్ తో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు, దర్శకుల భార్యలు వ్యాపారాల్లో రాణిస్తుంటారు. కానీ ప్రీతా విజయ్ కుమార్ స్థాయిలో కాదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కొంతమంది నటీమణులు వివాహం తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి తిరిగి క్యారెక్టర్ రోల్స్ చేయడం చూస్తూనే ఉన్నాము. కానీ ప్రీతా మాత్రం పూర్తిగా కెమెరాకి దూరంగా ఉన్నారు. 

Latest Videos

click me!