మెగాస్టార్ తాగిన ఎంగిలి కప్పును దాచుకన్న స్టార్ కమెడియన్, లక్ష ఇచ్చినా అది ఎవరికీ ఇవ్వడట.

First Published | Nov 7, 2024, 2:25 PM IST

మెగాస్టార్ చిరంజీవిమీద అభిమానంతో ఆయన సగం తాగేసి వదిలేసిన ఎంగిలికప్పును దాచుకున్నాడు ఓ స్టార్ కమెడియన్. చిరు అంటే ప్రాణం అంటున్న ఆయన లక్షలు ఇచ్చినా ఆ కప్పు మాత్రం ఎవరీ ఇవ్వడట. 

హీరోలకు డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ లో సామాన్యులు ఉంటారు సెలబ్రిటీలు ఉంటారు. స్టార్ హీరోలను ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన వారు కూడా ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చినవారు ఎంతో మంది ఉన్నారు. సునిల్, సత్యదేవ్, కార్తికేయ, ఇలా ఎంతో మంది స్టార్స్ చిరును ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చినవారే. 

Also Read: చిరంజీవికి చెల్లిగా, భార్యగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు
 

ఇక అలా వచ్చి ఇలా స్టార్లు గా మారినా కూడా.. స్టార్ డమ్ వచ్చింది కదా అని అభిమానాన్ని వదిలేసుకోరు. సామాన్యులు తమ అభిమాన స్టార్ హీరో సినిమాను ఎలా థియేటర్లో చూస్తారో.. అలానే చిరంజీవి సినిమాలను థియేటర్లలో.. ఫ్యాన్స్ మధ్య చూసేవారు చాలా మంది ఉన్నారు. చిరు జ్జాపకాలను పదిలంగా దాచుకునే సెలబ్రిటీ అభిమానులు ఎందరో ఉన్నారు. 

తాజాగా అలాంటి కమెడియన్ గురించి ఇఫ్పుడు చూద్దాం. అతనికి చిరంజీవి అంటే ప్రాణం. ఆయన్ను ఇమిటేట్ చేస్తూ.. ఇండస్ట్రీలోకి వచ్చాడు. మెగాస్టార్ లా కష్టపడి తనకంటూ ఓ ఇమేజ్ ను సాధించాడు. చచ్చేవరకూ చిరు అభిమానిగానే ఉంటా అంటున్నాడు. ఇంతకీ ఆ స్టార్ కమెడియన్ ఎవరు..? చిరంజీవిని ప్రాణంకంటే ఎక్కువగా అభిమానించే అతను ఎవరో తెలుసా..?  

Also Read:  ఈ సినిమా చేయను, వెళ్ళిపోతాను.. జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ తో గొడవపెట్టుకున్న మూవీ ఏదో తెలుసా..?


ఇక చిరుకు  ఫ్యాన్స్ కాదు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి డై హార్ట్ ఫ్యాన్స్ లో  టాలీవుడ్ కమెడియన్ శివారెడ్డి ఒకరు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా, తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. హీరో ఫ్రెండ్ పాత్రలు వేస్తూ..  కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సాధించుకోగలిగాడు శివారెడ్డి. 

శివారెడ్డి మెగాస్టార్ కు వీరాభిమాని. చిరుమీద ఎంత అభిమానం ఉందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు శివారెడ్డి.  తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. తన కెరీర్ మొత్తంలో వచ్చిన అవార్డుల మధ్యలో చిరంజీవి తాగి పక్కన పెట్టిన టీ కప్పును.. ఒక పెద్ద అవార్డుగా పెట్టుకున్నాడు శివారెడ్డి.

Also Read:కమల్ హాసన్ అమరన్ కి ముందు నిర్మించిన టాప్ 5 బ్లాక్ బస్టర్ సినిమాలు

శివారెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సాధించిన ఎన్నో అవార్డ్ లు అక్కడ కనిపిస్తాయి. అన్ని అవార్డ్ లలో ఓ టీకప్పు .. ఆ కప్పులో ఓ స్టార్ కూడా కనిపించింది. ఇన్ని అవార్డుల మధ్య ఈ టీ కప్పు ఏంటి.. అని అనుమానం వ్యాక్తం చేయగా.. శివారెడ్డి మాట్లాడుతూ.. అది మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తాగిన టీ కప్పు. ఆయన టీ తాగిన కప్పులో స్టార్ పెట్టి.. మెగాస్టార్ గుర్తుగా నేను పెట్టుకున్నాను అన్నారు. 

అంతే కాదు ఆ టీకప్పుఎన్ని లక్షలు ఇచ్చినా... ఎవరికీ ఇవ్వడట. ఒకప్పుడు ఓ సందర్భంలో అన్నయ్య ఆకప్పులో టీ సగం తాగారు నేను లాగేసుకొని మిగతా టీ నేను తాగి అందులో స్టార్ పెట్టి అలాగే గుర్తుగా పెట్టుకున్నా.. ఏ ఏడాదిలో తీసుకున్నానో గుర్తులేదు. దాదాపు 20 ఏళ్లు అవుతుంది.. నాకు వచ్చిన మొదటి అవార్డ్ పక్కన  ఈ కప్పును పెట్టుకున్నాను.. మెగాస్టార్ కప్పు అది అని ఎంతో ప్రేమగా చెప్పుకొచ్చాడు శివారెడ్డి. 

ఇలా మెగాస్టార్ చిరంజీవికి ఇలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. వారిని చూసినప్పుడల్లా.. ఇతర మెగా అభిమాను దిల్ ఖుష్ అవుతుంటారు. అది మా మెగాస్టార్ అంటే.. ఇలాంటి అభిమానం అందరికి సాధ్యం కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మెగాస్టార్ కు అలాంలి అభిమానులు లక్షల్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. 

ఇక శివారెడ్డి కామెంట్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ వరుస ఫెయిల్యూర్ సినిమాలతో బాధపడుతున్నారు. వాటినుంచి బయటపడటానికి ఆయన విశ్వంభర సినిమా చేస్తున్నాడు. విశ్వంభర సినిమా షూటింగ్ లో  బిజీగా ఉన్నారు. వశిష్ట్ డైరెక్ట్ చేసిన  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Latest Videos

click me!