నిండైన అందాలతో మనసులు దోచేస్తున్న శ్రీముఖి... చోళీ లెహంగాలో మైమరిపించే పోజులు!

Published : Oct 18, 2023, 03:14 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి సరికొత్త సోయగాలతో సిద్దమైంది. సాంప్రదాయ కట్టులో మనసులు దోచేసింది. చోళీ లెహంగాలో శ్రీముఖి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.   

PREV
110
నిండైన అందాలతో మనసులు దోచేస్తున్న శ్రీముఖి... చోళీ లెహంగాలో మైమరిపించే పోజులు!
Sreemukhi

మోడ్రన్ డ్రెస్సుల్లో కాక పుట్టించే శ్రీముఖి అప్పుడప్పుడు ట్రెడిషనల్ అవతార్ లో దర్శనమిస్తుంది. చోళీ లెహంగా ధరించిన శ్రీముఖి నిండుగా కనిపించింది. శ్రీముఖి అందానికి సోషల్ మీడియా ఫిదా అయిపోయింది. 

 

210
Sreemukhi

ఇక యాంకర్ గా శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది . ఆమె టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ గా అవతరించింది. పలు ఛానల్స్ లో భిన్నమైన షోలు శ్రీముఖి చేస్తుంది. షో ఏదైనా శ్రీముఖి తన ఎనర్జీ, గ్లామర్ తో ఆకట్టుకుంది.  
 

310
Sreemukhi

అలాగే నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది శ్రీముఖి. ఇటీవల విడుదలైన భోళా శంకర్ మూవీలో శ్రీముఖి క్రేజీ రోల్ చేసింది. చిరంజీవితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. 
 

410
Sreemukhi

పవన్ కళ్యాణ్- భూమికల ఖుషి చిత్రంలోని నడుము చూసే సన్నివేశాన్ని చిరంజీవి, శ్రీముఖి స్పూఫ్ చేశారు. భోళా శంకర్ పరాజయం కావడంతో శ్రీముఖితో సీన్స్ ట్రోల్స్ కి గురయ్యాయి. చిరంజీవి స్థాయికి తగిన సన్నివేశాలు కాదని నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు. 

 

510
Sreemukhi

భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో శ్రీముఖికి ఫేమ్ దక్కకపోగా ఉన్న ఇమేజ్ పోయింది. హీరోయిన్ గా ఎదగాలన్న ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.  మొదట్లో శ్రీముఖి హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. వేచి చూసి విసిగిపోయిన శ్రీముఖి యాంకర్ గా మారారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది. మెల్లగా బుల్లితెర స్టార్ గా ఎదిగింది. 

610
Sreemukhi


అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమెకు ప్లస్ అయ్యింది. బిగ్ బాస్  సీజన్ 3లో శ్రీముఖి కంటెస్టెంట్ చేసింది. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. 

710
Sreemukhi

రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. 

 

810
Sreemukhi

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.

910
Sreemukhi

ఇక పలుమార్లు శ్రీముఖి పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఆ రూమర్స్ ని శ్రీముఖి ఖండించింది. అందుకు ఇంకా సమయం ఉంది. పెళ్లి కుదిరిననాడు నేనే చెబుతాను. మీరు పుకార్లు లేపవద్దని ఒకింత అసహనం వ్యక్తం చేసింది. 


 

1010
Sreemukhi

లైఫ్ లో సెటిల్ అయిన శ్రీముఖి భారీగా సంపాదిస్తుంది. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకుంది. ఏడాదికి శ్రీముఖి సంపాదన కోట్లకు చేరింది. తన ఆర్జనతో ఫ్యామిలీని గొప్పగా చూసుకుంటుంది. తరచుగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో శ్రీముఖి విహారాలకు వెళుతూ ఉంటుంది. 

click me!

Recommended Stories