నాని రెమ్యూనరేషన్ అన్ని కోట్లా...? భారీగా పెంచేసిన నేచురల్ స్టార్.. ?

First Published | Oct 18, 2023, 1:43 PM IST

సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ.. టాలీవుడ్ లో తనను తాను కొత్త గా చూపించుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా ఆయన తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరో.. నేచురల్ స్టార్  నాని న్యూలుక్ లో మెరిసిపోతున్నాడు. అంతే కాదు సినిమా సినిమాకు కొత్తగా కనిపిస్తూ..  వరుసగా ప్రయోగాలు చేస్తూ.. గెలుపు ఓటములతో సబంధం లేకుండా.. దూసుకుపోతున్నాడు.  రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నానీ.. ఇదే మంచి టైమ్ అనుకున్నాడో ఏమో.. రెమ్యూనరేషన్ భారీగా పెంచాడట. 

Nani

దసరా సినిమాలో డీ గ్లామర్ లుక్ లో అలరించిన నానీ.. ప్రస్తుతం అలాంటి మరో ప్రయోగాత్మక సినిమాతో ముందుకు రాబోతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హాయ్ నాన్న మూవీ చేస్తున్నారు నాని.  ఒక యంగ్ హీరో నాన్న పాత్ర చేయడం.. అది కూడా రెండో సారి సాహసమనేచెప్పాలి. ఇక ఈమూవీలో యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. 
 


ఈ మూవీ తండ్రి కూతురి సెంటిమెంట్ కథగా తెరకెక్కుతుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈసినిమా తరువాత కూడా వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు నాని. ఈసినిమా తరువాత కూడా నాని మరో సినిమా లైన్ అప్ చేశాడు.  వివేక్ ఆత్రేయతో నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు నేచురల్ స్టార్.
 

అయితే  నాని నటించిన హాయ్ నాన్న రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాకి గాను నాని అక్షరాలా 22 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట.  వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై మోహన్ చెరుకూరి , డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు. నానీ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత ముట్టచెప్పారట టీమ్. అయితే ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరట్ అవుతోంది. 
 

ఇక నాని నెక్స్ట్ స్కంద నిర్మాతతో ఓ సినిమా చేస్తున్నాడు.శివ కార్తికేయన్ తో కాలేజ్ డాన్ లాంటి సినిమాను  తెరకెక్కించిన సిబి చక్రవర్తి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. . దీనికి గాను నాని అందుకుంటున్న పారితోషికం అక్షరాలా 25 కోట్లు అని తెలుస్తుంది. హాయ్ నాన్న హిట్ అయితే.. అది ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు సినిమా పండితులు. 
 

Latest Videos

click me!