ఉల్లి పొర లాంటి డ్రెస్ లో యాంకర్ రష్మీ పరువాల విందు... స్టార్ యాంకర్ సరికొత్త లుక్ వైరల్ 

Published : Jun 18, 2023, 02:30 PM IST

రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఈ బోల్డ్ బ్యూటీ కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు. సంప్రదాయ డ్రెస్ లో కూడా గ్లామర్ యాంగిల్ వదల్లేదు.   

PREV
19
ఉల్లి పొర లాంటి డ్రెస్ లో యాంకర్ రష్మీ పరువాల విందు... స్టార్ యాంకర్ సరికొత్త లుక్ వైరల్ 
Rashmi Gautam

వరుస ఫోటో షూట్స్ తో రష్మీ కాకరేపుతుంది. ఉల్లిపొర లాంటి డ్రెస్ లో పరువాల విందు చేసింది. ఆయన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక రష్మీ కెరీర్ పరిశీలిస్తే ప్లస్ అండ్ మైనస్ లతో సాగుతుంది. యాంకర్ గా ఆమె బిజీ అది ప్లస్. హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసింది. అది మైనస్. ఇకపై ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం కష్టమే.

29
Rashmi Gautam

రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బ్లాక్ బస్టర్. ఈ చిత్రానికి  పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా ఆడలేదు. దాంతో రష్మీ గౌతమ్ కెరీర్ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ హీరోయిన్ గా ఒక్క చిత్రానికి సైన్ చేయలేదు. 

39
Rashmi Gautam

యాంకరింగ్ లో మాత్రం రష్మీ జోరు చూపిస్తుంది. అనసూయ మొత్తంగా బుల్లితెరకు బై చెప్పేసింది. మల్లెమాల సంస్థ మెయిన్ యాంకర్ గా రష్మీ దున్నేస్తుంది.  

49
Rashmi Gautam

ప్రస్తుతం మల్లెమాల వారి షోస్ లో ఆధిపత్యం మొత్తం రష్మీదే. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ  భర్తీ చేస్తుంది. 

59
Rashmi Gautam

కొత్త యాంకర్ రావడంతో  జబర్దస్త్ షో చేరజారింది. అనసూయ స్థానంలోకి సౌమ్యరావు అనే కన్నడ సీరియల్ నటి  వచ్చారు. అయితే పండుగలకు, పబ్బాలకు మల్లెమాల రూపొందించే స్పెషల్ ఈవెంట్స్ లో రష్మీ సందడి చేస్తున్నారు. యాంకర్ గా ఆమెకు తిరుగులేదని చెప్పాలి. 

69
Rashmi Gautam

నటిగా రేసులో రష్మీ వెనుకబడ్డారు. సిల్వర్ స్క్రీన్ మీద అనసూయ దుమ్మురేపుతోంది. నిజానికి అనసూయ కంటే ముందు రష్మీకే హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. అయితే సినిమా సెలక్షన్ తెలియక రష్మీ ప్లాప్స్ చవిచూశారు. 
 

79
Rashmi Gautam

ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.
 

89
Rashmi Gautam

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. కెరీర్ బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారారు. 
 

99
Rashmi Gautam

జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వ్యక్తిగత కారణాలతో యాంకరింగ్ నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ఛాన్స్ రష్మీ దశ మార్చేసింది. హీరోయిన్ కావాలన్న ఆమె కోరిక కూడా తీర్చింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories