యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. 100% లవ్, అత్తారింటికి దారేది, జులాయి, వరుడు వంటి చిత్రాల్లో కనిపించారు. ఇక గత ఏడాది విడుదలైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీతో హీరోగా కూడా మారారు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.