Priyanka Chopra : హాలీవుడ్ స్టార్ యాక్టర్ తో ప్రియాంక చోప్రా.. అస్సలు తగ్గట్లేగా..

Published : Feb 04, 2022, 10:03 AM IST

హాలీవుడ్ లో రోజు రోజుకు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇమేజ్ పెరిగిపోతోంది. అక్కడ స్టార్ పాప్ సింగర్ గా ఉన్న తన భర్త నిక్ ను మించి ఇమేజ్ ను సాధిస్తోంది ప్రియాంక. ప్రస్తుతం ఈ స్టార్ బ్యూటీ ఓ బంపర్ ఆఫర్ కూడా పొందినట్టు తెలుస్తోంది.

PREV
17
Priyanka Chopra : హాలీవుడ్ స్టార్ యాక్టర్ తో ప్రియాంక చోప్రా..  అస్సలు తగ్గట్లేగా..

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ చేరి  గ్లోబల్‌ స్టార్‌ గా ఎదిగింది ప్రియాంక చోప్రా (Priyanka Chopra). చాలా తక్కు టైమ లో  వరల్డ్‌వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందే బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న ప్రియాంక.. స్టార్ హాలీవుడ్ సింగర్.. తనకంటే చాలా చిన్నవాడు అయిన నిక్ (Nick Jonas) ను పెళ్లాడి  హాలీవుడ్‌లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

27

హాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలతో మరింత జోరు పెంచింది ప్రియాంక చోప్రా (Priyanka Chopra). తన టాలెంట్ తో అక్కడి మేకర్స్ ను మెస్మరైజ్ చేస్తూ.. సత్తా చూపిస్తోంది బ్యూటీ. రీసెంట్ గా  హాలీవుడ్​ యాక్షన్​ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన ది మ్యాట్రిక్స్​ రిసరెక్షన్స్ లో నటించి మెప్పించన ప్రియాకం చోప్రా (Priyanka Chopra).. ఈసినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది.

37

ఇక ప్రస్తుతం సిటాడెల్ అనే ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది ప్రియాంక చోప్రా. అమెజాన్​ ప్రైమ్​ వీడియోస్ లో స్క్రీమింగ్ అయ్యే ఈ సిరీస్​తో ఫుల్ బిజీగా ఉంది గ్లోబల్ స్టార్. ఇది చేస్తుండగానే రీసెంట్ గా  ప్రియాంక హాలీవుడ్ లోనే మరో క్రేజీ ఆఫర్​ కొట్టేసింది. హాలీవుడ్ లో క్రేజీ స్టార్ తో నటించే అవకాశం ఆమెను వరించింది.

47

ఆంథోనీ మాకీ (Anthony Mackie)  తో కలిసి ఎండింగ్ థింగ్స్ లో నటించబోతోంది ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్​ జేమ్స్​ కామెరూన్​ తెరకెక్కించిన యాక్షన్​ కామెడీ మూవీ ట్రూ లైస్ ఇన్పిరేషన్ తో..అదే విధంగా రూపొందించబోతున్న ఈసినిమాను కెవిన్ డైరెక్ట్ చేయబోతున్నారు. ​ ఈ సినిమాలో ప్రియాంక (Priyanka Chopra) పాత్రపై కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. నేరస్తుల మధ్య బ్రతికే యువతి.. అక్కడి నుంచి బయటపడి.. స్వతంత్రంగా జీవించాలి అనుకునే పాత్ర లో కనిపించబోతుందట ప్రియాంక చోప్రా(Priyanka Chopra).

57

మార్వెల్​ సినిమాటిక్​ యూనివర్స్​ మూవీస్​లో నటించిన స్టార్ యాక్టర్​తో కలిసి స్క్రీన్​ షేర్ చేసుకోబోతోంది  ప్రియాంక(Priyanka Chopra). యాంట్​ మ్యాన్​, అవెంజర్స్:​ ఇన్ఫినిటీ వార్​, అవెంజర్స్​ ఎండ్​గేమ్ లాంటి సూపర్ హిటో హాలీవుడ్ మూవీస్ తో పాటు ఫాల్కన్ అండ్​ ది వింటర్​ సోల్జర్​ వెబ్​ సిరీస్​తో ఆకట్టుకున్న ఆంథోనీ మాకీ (Anthony Mackie)  తో కలిసి నటించబోతోంది ప్రియాంక 

67

ఆ మధ్య వరకూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేది ఈహాలీవుడ్ కమ్ బాలీవుడ్ బ్యూటీ. ఇప్పటికీ టైమ్ ఉంటే సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే ఉంటుంది స్టార్. ఈ ఏజ్ లో కూడా హాట్ నెస్  ఏమాత్రం మిస్ అవ్వలేదు ప్రియాంక (Priyanka Chopra) . హాట్  అండ్ క్రేజీ ఫోటోలకు ఫోజులిస్తూ.. హడావిడి చేస్తుంటుంది స్టార్ హీరోయిన్.   

77

బాలీవుడ్ టు హాలీవుడ్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) చాలా కష్టపడింది. ఎన్నో అవమానాలను తాను ఎదుర్కొన్నట్టు చాలా సార్లు ఇంటర్వ్యూలలో చెప్పింది ప్రియాంక(Priyanka Chopra). నలబై ఏళ్ల వయస్సులో కూడా వన్నె తగ్గకుండా చూసుకుంటుంది. పెళ్లి తరువాత కూడా ఏమాత్రం ఇమేజ్ తగ్గకుండా దూసుకుపోతోంది ప్రియాంక.

click me!

Recommended Stories