చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో నటుడు అజిత్ కుమార్ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పలువురు అజిత్ అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కోలీవుడ్ మాస్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. సౌత్ లో స్టార్ హీరో ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు అజిత్ . వివాదాలకు దూరంగా.. ప్రశాంత జీవితం ఇష్టపడుతాడు అజిత్. అటు సినిమాలు.. ఇటు తన పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీగా లీడ్ చేసుకుంటూ.. తనకు ఇష్టమైన వాటిని ఎంతో ఇంష్టంగా చేసుకుంటూ వెళ్తున్నాడు అజిత్. సినిమాల్లో నటిస్తూ మధ్యమధ్యలో ఫారిన్ ట్రిప్స్, బైక్ ట్రిప్పులతో బిజీబిజీగా గడుపుతున్న నటుడు అజిత్.
25
నటుడిగా చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా తన అంతరంగాన్ని వదులుకోకుండా ఫోటోగ్రఫీ, వంట, ఏరో మోడలింగ్, బైక్ రేసింగ్ వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా బైక్ పై ప్రపంచాన్ని చుట్టే ప్రయత్నానికి కూడా శ్రీకారం చుట్టాడు అజిత్. ఇకఅజిత్ ఎప్పుడూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. అతను తన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు మరియు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటాడు.
35
ఈక్రమంలోనే బుధవారం వైద్య పరీక్షల నిమిత్తం అపోలో ఆస్పత్రికి వెళ్లారు అజిత్. కాని అక్కడ షాకింగ్ విషయం తెలిసినట్టు సమాచారంవైద్య పరీక్షల్లో నటుడు అజిత్ మెదడులో స్వల్ప వాపు ఉన్నట్లు తేలిందట. మెదడులో వాపుగురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపినట్టు తెలుస్తోంది. చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.దీని ప్రకారం, అపోలో ఆసుపత్రిలో డాక్టర్ పెరియగరుప్పన్ నేతృత్వంలోని వైద్యుల బృందం 4 గంటలు శ్రమపడి అజిత్‌కు శస్త్రచికిత్స చేసి అతని మెదడు నుండి కణితిని తొలగించినట్లు తమిళ మీడియాల కథనాల నుంచి సమాచారం.
45
సోషల్ మీడియాలో అప్ డేట్స్ అడుగుతున్న అజిత్ అభిమానులు ఈ వార్తతో షాక్ కు గురయ్యారు. అజిత్ త్వరగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని ఫ్యాన్స్ ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మిజ్ తిరుమేని దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నాడు. మార్చి 15న అజర్ బైజాన్‌లో ఈ సినిమా తదుపరి దశ షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుండగా, నిన్న అజిత్ అకస్మాత్తుగా సాధారణ శారీరక పరీక్ష కోసం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
55
ప్రస్తుతం అజిత్ పరిస్థితి బాగుందని.. ఆయన డాక్టర్ల పర్యావేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తమిళనాడుతో పాటు.. సౌత్ లో ని అజిత్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. అజిత్ త్వరగా కోలుకుని షూటింగ్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ విషయంలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్లు మాత్రం ఇవ్వలేదు.