కజిన్ తో నిహారిక లవ్ స్టోరీ..? విడాకులు తర్వాత ఇదేం ట్విస్ట్ బాబోయ్!

Published : Mar 08, 2024, 12:16 PM ISTUpdated : Mar 08, 2024, 01:12 PM IST

నిహారిక కొణిదెల గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆమె సొంత కజిన్ కి జంటగా నటించనుందట. ఆ కథ ఏమిటో? ఆ కజిన్ ఎవరో? చూద్దాం...   

PREV
16
కజిన్ తో నిహారిక లవ్ స్టోరీ..? విడాకులు తర్వాత ఇదేం ట్విస్ట్ బాబోయ్!
Niharika Konidela


నిహారిక కొణిదెల పట్టుబట్టి హీరోయిన్ కావాలన్న పంతం నెగ్గించుకుంది.  నిహారిక హీరోయిన్ అవుతానంటే మెగా ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించినట్లు సమాచారం. అయినా నిహారిక హీరోయిన్ అయ్యారు. ఒక మనసు ఆమె డెబ్యూ మూవీ. అది అంతగా ఆడలేదు.
 

 

26
Niharika Konidela

అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఒకటి రెండు తమిళ చిత్రాలు కూడా చేసింది. నటిగా బ్రేక్ రాలేదు. దాంతో 2020 డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకుంది. జొన్నలగడ్డ నాగ చైతన్యతో నిహారిక వివాహం గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వీరి పెళ్ళికి వేదిక అయ్యింది. 

 

36
Niharika Konidela

పెళ్ళైన రెండేళ్లకు మనస్పర్థలు తలెత్తాయి. వెంకట చైతన్య-నిహారిక విడాకులు తీసుకుని విడిపోయారు. గత ఏడాది ప్రారంభంలో ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. విడాకులు అనంతరం తిరిగి కెరీర్ స్టార్ట్ చేసింది నిహారిక. నిర్మాతగా, నటిగా బిజీ అవుతుంది. ఆమె చేతిలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 

46
Niharika Konidela

ఇటీవల ఓ తమిళ చిత్రానికి కూడా సైన్ చేసింది. తన ఓన్ బ్యానర్ లో స్మాల్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తుంది. హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్న నిహారిక.. మెగా హీరోతో మూవీకి జెండా ఊపిందట. అతను ఎవరో కాదు ఉప్పెన వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్-నిహారిక కాంబోలో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారట. 

 

56
Niharika Konidela

డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ వైరల్ అవుతుంది. నిహారిక మేనత్త కొడుకైన వైష్ణవ్ వరసకు కజిన్ అవుతాడు. కజిన్ తో నిహారిక రొమాన్స్ చేసినట్లు అవుతుంది. ఇక నిహారిక గతంలో మెగా హీరోలతో కలిసి నటించింది లేదు. 

66

చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డి లో నిహారిక చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఇక వైష్ణవ్ డెబ్యూ మూవీ ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్. అయితే తర్వాత ఆయన నటించిన చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. వైష్ణవ్ లేటెస్ట్ మూవీ ఆదికేశవ సైతం నిరాశపరిచింది.. 
 

Read more Photos on
click me!