పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కుళ్ళు జోకులు.. నిహారిక విడాకులపై వెకిలి కామెడీ, స్టాండప్ కమెడియన్ ను వదిలేదిలేదంటున్న మెగా అభిమానులు

Published : Apr 12, 2026, 07:44 AM IST

స్టాండప్ కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్, నిహారికల పర్సనల్ లైఫ్ పై కుళ్లు జోకులు వేశాడు ఓ వక్తి. అది కాస్త వైరల్ అవ్వడంతో.. మెగా అభిమానులు మండిపడుతున్నారు. 

PREV
15
వ్యక్తిగత జీవితాలపై జోకులు..

ఈమధ్య కాలంలో స్టాండప్ కామెడీ పేరుతో వ్యక్తిగత జీవితాలపై వెకిలి జోకులు, కామెడీ కామెంట్స్ పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని వారు చేస్తున్న కామెంట్స్ వివాదంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. స్టాండప్ కమెడియన్‌గా గుర్తింపు పొందిన అనుదీప్ కటికాల పవన్ కళ్యాణ్, నిహారికల మీద చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

25
పవన్ కళ్యాణ్, నిహారికపై వివాదాస్పద కామెంట్స్.

.అనుదీప్ కటికాల ఓ స్టాండప్ షోలో డైవర్స్ అనే అంశంపై మాట్లాడుతూ.. ఏపి డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్న నాగబాబు కూతురు నటి నిర్మాత, నిహారిక వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నిహారికకు డైవర్స్ సమయంలో, పేపర్లపై సంతకం పెట్టే విషయంలో పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసిందని ఆయన సెటైరికల్ గా అన్నాడు. పవన్ కళ్యాణ్‌కు డైవర్స్ విషయాల్లో అనుభవం ఉందని అన్నాడు.

35
స్టాండప్ కామెడీ పేరుతో వెకిలి వేశాలు..

అంతే కాదు ఈ విషయంలో నాగబాబు కూడా పవన్ కళ్యాణ్‌ కు ఫోన్ చేయమని నిహారికకు సలహా ఇచ్చాడంటూ..వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. స్టాండప్ కామెడీ పేరుతో మెగా ఫ్యామిలీలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జోకులు వేయడం వివాదంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు అయితే ఈ కామెంట్స్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు.

45
మండిపడుతున్న మెగా అభిమానులు..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అనుదీప్ కటికాల కుళ్లు జోకులను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబానికి సంబంధించిన పర్సనల్ విషయాలను స్టాండప్ కామెడీ పేరుతో ఇలా పబ్లిక్ గా ప్రస్తావించడం, జోకులు వేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

55
గుర్తింపు కోసమే ఇలా చేస్తున్నారా?

ఇప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని అనుదీప్ కటికాల ఈ వివాదంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అలా అవ్వడం కోసమే అతను ఇలాంటి కామెంట్ చేసి ఉంటాడని పలువురు జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సాధారణ నెటిజన్లు కూడా వ్యక్తిగత విషయాలను కామెడీగా చూపించడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదంపై అనుదీప్ కటికాల ఇప్పటివరకు స్పందించలేదు. నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories