మహేష్ బాబు కోసం హాలీవుడ్ విలన్, రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా?

Published : May 19, 2025, 07:07 PM IST

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB29 సినిమా పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న నేపథ్యంలో,  ఈసినిమాలో విలన్ పాత్రపై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది.

PREV
15

రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB29 సినిమా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం హాలీవుడ్ నటుడు డ్జిమోన్ హౌన్సౌ ఎంపికయ్యారని తెలుస్తోంది. రాజమౌళి ఇటీవల లండన్‌లో డ్జిమోన్‌తో సీక్రెట్‌గా సమావేశమై ఈ పాత్రపై చర్చించినట్లు సమాచారం. ఈ పాత్రలో డ్జిమోన్ ఒక ఆఫ్రికన్ హంటర్‌గా కనిపించనున్నారు, మహేష్ బాబును వెంబడిస్తూ, భయాన్ని కలిగించేలా డిజైన్ చేయబడినట్లు టాక్ నడుస్తోంది.

25

డ్జిమోన్ హౌన్సౌ అద్భుతమైన హాలీవుడ్ నటుడు. తను 'గ్లాడియేటర్', 'బ్లడ్ డైమండ్', 'షాజాం', 'రిబెల్ మూన్' వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి గత చిత్రాల్లో ఇమేజ్ లేని నటులను ఎంపిక చేసి, ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావం చూపించాడు. ఇది కూడా అదే తరహాలో ఉండే అవకాశం ఉంది.

35

SSMB29 సినిమా కథ ఆఫ్రికన్ అడవుల్లో సాగే థ్రిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, విలన్ పాత్రకు డిజిమోన్ హౌన్సౌ ఎంపిక చేయడం కథకు సరిగ్గా సరిపోతుందని పరిశ్రమ విశ్లేషిస్తోంది.

45

ఈ చిత్రం కోసం రాజమౌళి ప్రత్యేకంగా ఆఫ్రికన్ పుస్తకాలు కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది కథకు మరింత లోతు, విశ్వసనీయతను ఇవ్వడానికి చేసిన ప్రయత్నం కావచ్చు.

55

SSMB29 సినిమా కోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదలకు సిద్ధంగా ఉండవచ్చని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories