ఎట్టకేలకు శ్రీలీల కన్నడ మూవీ రిలీజ్‌, `జూనియర్‌` నుంచి ఫస్ట్ సాంగ్‌ ఔట్‌

Published : May 19, 2025, 07:02 PM IST

టాలీవుడ్‌ సెన్సేషన్‌ శ్రీలీల నటించిన కన్నడ మూవీ `జూనియర్‌` చాలా కాలంగా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్‌ కాబోతుంది. తాజాగా ఫస్ట్ సాంగ్ విడుదలైంది. 

PREV
16
ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిన శ్రీలీల అంతలోనే డౌన్‌

శ్రీలీల ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే పీక్‌ కెరీర్‌ని చూసింది. అంతలోనే డౌన్‌ అయ్యింది. వరుస పరాజయాలు ఆమె కెరీర్‌కి పెద్ద దెబ్బ కొట్టాయి. అయినా మళ్లీ నిలబడింది. ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది శ్రీలీల. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలుండటం విశేషం.

26
`ధమాఖా`తో శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకోలే

కన్నడకు చెందిన శ్రీలీల కన్నడలోనే `కిస్‌` మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. కన్నడలో రెండు సినిమాలు చేసి, `పెళ్లి సందడి`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ హీరోగా నటించడం విశేషం. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ మూవీ రూపొంది ఫర్వాలేదనిపించుకుంది. ఇక రవితేజతో `ధమాఖా`తో విజయాన్ని అందుకుని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

36
ఎట్టకేలకు శ్రీలీల కన్నడ మూవీ `జూనియర్‌` రిలీజ్‌

ఈ క్రమంలో మధ్య మధ్యలో ఒకటి అర కన్నడ మూవీస్‌ చేసింది శ్రీలీల. అయితే చాలా కాలంగా రిలీజ్‌కి నోచుకోని శ్రీలీల కన్నడ మూవీ `జూనియర్‌` ఎట్టకేలకు రిలీజ్‌కి రెడీ అవుతుంది. గాలి జనార్థన్‌ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా శ్రీలీల నటించింది. దీనికి రాధాకృష్ణ దర్శకుడు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. జూన్‌ 18న విడుదలకు రెడీ అవుతుంది. అయితే ఈ మూవీ ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది, కానీ మధ్యలోనే ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల పూర్తి చేసి రిలీజ్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు థియేటర్లోకి తీసుకురాబోతున్నారు.

46
`జూనియర్‌` ఫస్ట్ సాంగ్‌ రిలీజ్‌

తాజాగా `జూనియర్‌` మూవీ నుంచి మొదటి సాంగ్‌ విడుదలయ్యింది. `లెట్స్ లివ్‌ దిస్‌ మూమెంట్‌` పేరుతో సాగే ఈ పాటని సోమవారం విడుదల చేశారు. భారీ ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు. ఈ సాంగ్‌ ఆద్యంత ఆకట్టకుంటుంది. జీవితం, ప్రేమ, సంగీతం అన్నిటినీ కలిపే ఫీలింగ్ తో, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ ఈ పాటను మరింత రిచ్ గా ఈ పాటని కంపోజ్ చేశారు .

56
ట్రెండింగ్‌లో శ్రీలీల `జూనియర్‌` ఫస్ట్ సాంగ్‌

డీఎస్పీ హై ఎనర్జీతో, ఫుట్ టాపింగ్ బీట్‌లతో పాటను కంపోజ్ చేశారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌తో బ్లెండ్ అయిన ఈ ట్యూన్‌లో యువతను బాగా ఆకట్టుకుంటుంది. జస్ప్రీత్ జాజ్ వాయిస్ ఈ పాటకి శక్తినిచ్చింది. శ్రీమణి రాసిన సాహిత్యం ఎమోషన కలిగించేలా ఉంది. విజువల్‌గా ఈ పాటలో కిరీటి, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కిరీటి గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి రూపొందించిన కొరియోగ్రఫీ అదిరిపోయింది. కలర్‌ఫుల్ సెట్స్‌పై గ్రాండ్‌గా చిత్రీకరించిన ఈ పాట విజువల్ గా కూడా కలర్‌ఫుల్‌గా ఉంది.

66
`జూనియర్‌`తో జెనీలియా సౌత్‌ రీఎంట్రీ

ఈ సినిమాతో జెనీలియా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. అలాగే కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ సినిమాకు విజువల్ గ్రాండియర్ అందించడం విశేషం. ఇక ఈ మూవీ జూన్‌ 18న తెలుగు, కన్నడతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ మూవీ అయినా వరుస పరాజయాల్లో ఉన్న శ్రీలీలకి హిట్‌ ని ఇస్తుందా అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories