రాజమౌళికి హాలీవుడ్ దిగ్గజాలు ఫిదా అవుతున్న వేళ.. మహేష్ మూవీ ఇంకెలా ఉంటుందో..?

అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు మారుమోగుతోంది. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి ప్రపంచ దిగ్గజ దర్శకులు ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫిదా అవుతున్నారు. 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై పెను ప్రభంజనం సృష్టిస్తోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నాటు నాటు సాంగ్ కి గాను సంగీత దర్శకుడు కీరవాణికి ఈ అవార్డు లభించింది. 

అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు మారుమోగుతోంది. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి ప్రపంచ దిగ్గజ దర్శకులు ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న తర్వాత రాజమౌళి వీరిద్దరిని కలిసిన సంగతి తెలిసిందే. 


ఇద్దరూ రాజమౌళిని అభినందించారు. దీనితో ప్రతి ఒక్కరిలో రాజమౌళి తదుపరి చిత్రంపై ఉత్కంఠ పెరిగిపోయింది. తన నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని జక్కన్న ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రాజమౌళికి ప్రస్తుతం పూర్తి స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది అని చెప్పొచ్చు. దీనితో జక్కన్న నెక్స్ట్ మూవీ పై అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటుంటేనే ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతోంది. 

దీనితో మహేష్ బాబు అభిమానులు SSMB29 హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు కటౌట్ ని జక్కన్న కరెక్ట్ గా వాడుకుంటే హాలీవుడ్ స్థాయి మూవీ అవుతుంది అని అంటున్నారు. మహేష్ మూవీ గురించి రాజమౌళి ఆల్రెడీ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచం మొత్తం తిరిగే సాహసికుడు కథే ఈ చిత్రాన్ని అని రాజమౌళి తెలిపారు. 

తప్పకుండా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా క్రేజీ డిమాండ్ ఏర్పడడం ఖాయం. ఆర్ఆర్ఆర్ చిత్రానికే జక్కన్న ఈ రేంజ్లో హంగామా చేస్తే.. మహేష్ మూవీకి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

Mahesh Babu

జేమ్స్ కామెరూన్ రాజమౌళితో మాట్లాడుతూ.. నీవు ఎంత వైల్డ్ గా ఆలోచిస్తావో ఆడియన్స్ అంత బాగా సర్పైజ్ అవుతారు.నీ ఊహ మొత్తం మూవీ మేకింగ్ ప్రాసెస్ లోనే జరుగుతుంది. ఇప్పుడు మీకు దక్కుతున్న గుర్తింపు అంతా బోనస్. ప్రపంచం మిమ్మల్ని చూస్తోంది అని జేమ్స్ కామెరూన్ అన్నారు. ఈ వీడియో వైరల్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ SSMB29 గురించి కామెంట్స్ చేస్తున్నారు. 

Latest Videos

click me!