మహారాణిలా మెరిసిన ప్రియా ప్రకాశ్ వారియర్.. అందంతో కట్టిపడేస్తున్న మలయాళీ భామ!

Published : Jan 16, 2023, 06:11 PM IST

కన్నుగీటిన వీడియోతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priaya Prakash Varrier). దీంతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఆ క్రేజ్ ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.  

PREV
16
మహారాణిలా మెరిసిన ప్రియా ప్రకాశ్ వారియర్.. అందంతో కట్టిపడేస్తున్న మలయాళీ భామ!

మలయాళ చిత్రం ‘ఓరు అదార్ లవ్’తో  హీరోయిన్ గా మెప్పించింది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ చిత్రంలోని కన్నుగీటే వీడియో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో దెబ్బకు స్టార్ డమ్ తన సొంతం అయ్యింది.
 

26

ప్రస్తుతం తన స్టార్ డమ్ ను దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్నా ఎడెనిమిది చిత్రాలతో ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ ను దక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియా తెగ మెరుస్తోంది.

36

మరింత పాపులారిటీని దక్కించుకునేందుకు ప్రియా వారియర్  నెట్టింట కూడా గ్లామర్ విందు చేస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలో తాజాగా రాయల్ లుక్ లో మెరిసింది.
 

46

పట్టుచీర, ఆకర్షణీయమైన జ్యూయల్లరీలో ప్రియా వారియర్ మహారాణిలా మెరిసింది. హుందాతనం కొట్టొచ్చేలా ఫొటోలకు పోజులిచ్చింది. ప్రిన్స్ అవతార్ లో రాయల్ లుక్ ను సొంతం చేసుకున్న మలయాళీ భామా అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటోంది. 

56

మరోవైపు తన రూపసౌందర్యంతోనూ మైమరిపిస్తోంది. ప్రియా ప్రకాశ్ వారియర్ ఇలా దర్శనమివ్వడం బహుశా ఇదే మొదటిసారి. అయితే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకునేందుకు అన్ని విధాలుగా నెట్టింట దర్శనమిస్తోందీ బ్యూటీ. మరో గ్లామర్ రోల్స్ లో  నటిస్తానని సిగ్నల్స్ ఇస్తూనే.. ఇలా మహారాణిలా మెప్పిస్తానంటోంది.
 

66

ప్రస్తుతం ప్రియా వారియ్ బాలీవుడ్ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. హిందీలో నటించిన నాలు చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అలాగే కన్నడలో ‘విష్ణు ప్రియా’ అనే చిత్రంతో అలరించనుంది. ఇక మలయాళంలో ‘4 ఇయర్స్’, ‘కొల్లా’తో పాటు మరో చిత్రంలో నటిస్తోంది. ఆల్మోస్ట్ ఈ చిత్రాలన్ని షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.  

Read more Photos on
click me!

Recommended Stories