Acharya Prerelease Event : రాజమౌళి, రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ.. ఆడియెన్స్ గోలకు దద్దరిల్లిన గ్రౌండ్..

Published : Apr 23, 2022, 09:08 PM IST

మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈరోజు గ్రాండ్ గా కొనసాగుతోంది. తాజాగా ధర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్ ఈవెంట్ కు ఎంట్రీ ఇచ్చారు.   

PREV
16
Acharya Prerelease Event : రాజమౌళి, రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ.. ఆడియెన్స్ గోలకు దద్దరిల్లిన గ్రౌండ్..

మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. 
 

26

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్రీ ఎంటర్ టైనర్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కోసం మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మెగా అభిమానుల్లో  ప్రీ రిలీజ్ ఈవెంట్ జోష్ పెంచుతోంది. ఇప్పటికే గ్రౌండ్ పూర్తిగా ఆడియెన్స్ తో నిండిపోయింది.

36

యాంకర్ సుమ వ్యాక్యాతగా వ్యవహరిస్తున్నఈ మెగా ఈవెంట్ కు ఇప్పటికే ఆచార్య (Acharya) మూవీ ఈవెంట్ కు దర్శకుడు కొరటాల శివ, మెహర్ రమేశ్ హాజరయ్యారు. దీంతో ఒక్కొక్కరుగా అతిథులు ఈవెంట్ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. 
 

46

కాగా కొద్ది క్షణాల కిందనే టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), మెగా పవర్ రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. వీరి రాకను గమనించిన ఆడియెన్స్ విజిల్స్, అరుపులతో గ్రౌండ్ దద్దరిల్లిపోయింది. ఎట్టకేళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  అనుకున్నట్టుగా రాజమౌళి రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. రాజమౌళి, రామ్ చరణ్ తో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా హాజరయ్యారు. 
 

56

చరణ్, రామ్ చరణ్ ఈవెంట్ కు రాగానే ముందుగానే హాజరైన అతిథులు వారిని ఆహ్వానించారు. ఆ తర్వాత అతిథి చైర్లలో ఆసీనులయ్యారు. వీరి రాకతో గ్రౌండ్ కే ఒక కళ వచ్చిందని చెప్పాలి. దీంతో ఆడియెన్స్ లో రెండింతలుగా హుషారు ఉప్పొంగింది. 

66

తండ్రీకొడుకులు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. చిరు, చరణ్ కు జోడీలుగా హీరోయిన్లు కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories