రాజమౌళి తన సినిమాకోసం చాలా జాగ్రత్తలు వహిస్తారు. పాత్రకు ప్రాణంపోసే నటులను మాత్రమే ఏరీ కోరి ఎంచుకుంటారు. ఈక్రమంలో జక్కన్న మెచ్చిన నటి గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజమౌళి ఎంతో మంది స్టార్స్ తో పనిచేశారు, పని చేయించారు కూడా. రాజమౌళి ఎంత మందితో పనిచేసినా.. ఆయన మెచ్చిన లేడీ స్టార్స్ మాత్రం సావిత్రి, సూర్యకాంతం మాత్రమే.
అయితే ఈ జనరేషన్ లోని యంగ్ స్టార్స్ లో మాత్రం జక్కన్న ఓ హీరోయిన్ నటన అంటే అభిమానిస్తాడట. ఆమె మరెవరో కాదు అనీ. నాగార్జున హీరోగా నటించిన రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అనీ. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించగా.. సినిమాలో యాక్షన్ సీన్స్ ను రాజమౌళి డైరెక్ట్ చేశారు. కీరవాణి సంగీతం అందించారు.
Also Read: ప్రభాస్, షారుఖ్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న కమెడియన్, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ కామెడీ యాక్టర్ ఎవరో తెలుసా?