Rajamouli: ప్రపంచం మెచ్చిన తెలుగు దర్శకుడు రాజమౌళి.. ఆయన కుటుంబంలో అందరికి సినిమాతో అనుబంధం ఉంది. ఇక రామౌళి ఇంటికి వచ్చిన కొడలు కూడా అతి పెద్ద సినిమా కుటుంబం నేపథ్యం ఉన్న సంగతి ఎంత మందికి తెలుసు?
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మార్క్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు చిన్న చూపు చూసిన తెలుగు సినిమాను బాలీవుడ్ ను మించి నిలబెట్టాడు జక్కన్న. ఈపేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి పేరు మీదే వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరోకి పాన్ ఇండియా లెవెల్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో, అంతకు మించిన క్రేజ్ తో పాటు మార్కెట్ రాజమౌళికి సొంతం. అందుకే రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా, ఆ హీరో ఇమేజ్‌సైతం భారీగా పెరిగిపోతుంది.
25
సూపర్ ఫాస్ట్ గా వారణాసి షూటింగ్..
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ మూవీని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది, రీసెంట్ గా ఈ సినిమా నుంచి కొన్ని పోటోలు కూడా లీక్ అయ్యాయి. ఒక వైపు షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతుండగా.. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
35
రాజమౌళి కోడలు బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
ఇదిలా ఉంటే, రాజమౌళి కుటుంబంలో ఆయన కోడలు పూజ ప్రసాద్ గురించి చాలామందికి తెలియదు. ఆమె కూడా రాజమౌళి లాగా చాలా టాలెంటెడ్. పూజ ప్రసాద్ అద్భుతమైన గాత్రం కలిగిన ఒక గొప్ప సింగర్. అయితే తన వద్ద ఉన్న ఈ సింగింగ్ టాలెంట్‌ను సినిమాలకు ఉపయోగించకుండా, కేవలం దేవుడికే సమర్పించుకుంది. ఇప్పటి వరకు ఆమె వందల సంఖ్యలో భక్తి గీతాలను ఆలపించారు. సినిమాల్లో పాటలు పాడేందుకు ఆమెకు ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు వచ్చినప్పటికీ, వాటిని వినయంగా తిరస్కరించారు.
అంతేకాకుండా, పూజ ప్రసాద్‌కి అతి పెద్ద సినీ, వ్యాపార బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. టాలీవుడ్ లెజండరీ స్టార్ ప్రొడ్యూసర్ వీ.బి. రాజేంద్ర ప్రసాద్ మనవరాలే ఈ పూజ ప్రసాద్. వీ.బి. రాజేంద్ర ప్రసాద్ కుమారుడే వర్సటైల్ నటుడు జగపతి బాబు. ఈ రకంగా పూజ ప్రసాద్‌కి జగపతి బాబు స్వయానా పెద్దనాన్న అవుతారు. ఇక ఆమె తండ్రి రాంప్రసాద్ కూడా ఒక ప్రముఖ వ్యాపారవేత్త. వేల కోట్ల ఆస్తులతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులతో కూడా ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
55
కార్తికేయ పెళ్లిలో సందడి చేసిన సెలబ్రిటీలు..
ఇక ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ, పూజ ప్రసాద్‌లలో వివాహం 2018వ సంవత్సరంలో రాజస్థాన్‌లోని జైపూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి టాలీవుడ్ దిగ్గజాలు ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున వంటి బడా స్టార్స్ హాజరై సందడి చేశారు. ఆ వేడుకల్లో స్టార్ హీరోలు వేసిన డాన్సుల వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.