Varanasi Movie: ప్రపంచ సినిమా చరిత్రలోనే రాజమౌళి సరికొత్త ప్రయోగం.. వారణాసిలో అదే హైలైట్

Published : Oct 09, 2026, 07:58 PM IST

Varanasi Movie: మహేష్ బాబు హీరోగా వస్తున్న 'వారణాసి' సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు జరగనటువంటి ప్రయోగం చేయబోతున్నారు.

PREV
14
గ్లోబల్‌ ఫిల్మ్ గా వారణాసి

దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమా కోసం ఇండియన్ ఆడియన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని జక్కన్న పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాట, టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

మహేష్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తుండటమే ఈ సినిమాపై ఇంత క్యూరియాసిటీకి ప్రధాన కారణం. గతంలో 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లారు రాజమౌళి. ఇప్పుడు 'వారణాసి' సినిమాతో మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.

కథ, విజువల్స్, యాక్షన్ సీన్స్, సినిమాలో క్రియేట్ చేసిన కొత్త ప్రపంచం.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలని చిత్రబృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ బయటికొచ్చినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

24
'వారణాసి' కోసం కొత్త భాషను సృష్టించారా?

ఇప్పుడు 'వారణాసి' సినిమా గురించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నారట రాజమౌళి. సినిమాలో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల కోసం ఒక ప్రత్యేకమైన భాషను, దానికి తగ్గట్టుగా ఒక కొత్త లిపిని సృష్టించారట. కథలో ఉండే ఆ కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు మరింత సహజంగా, విభిన్నంగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త భాషను వాడబోతున్నారని టాక్ నడుస్తోంది.

ఒకవేళ ఈ వార్తే నిజమైతే, 'వారణాసి' సినిమాలో రాజమౌళి మరో కొత్త ప్రయోగానికి రెడీ అయినట్లే. గతంలో 'బాహుబలి' సినిమా కోసం 'కిలికి' అనే ఒక కల్పిత భాషను సృష్టించిన విషయం తెలిసిందే. అప్పుడే జక్కన ఒక ప్రయోగం చేశారు. ఆ సినిమాలో క్రియేట్ చేసిన కల్పిత ప్రపంచానికి తగ్గట్టుగా ఉన్న ఆ భాష ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు 'వారణాసి'లో కూడా అలాంటి ప్రయోగమే జరుగుతుందనే వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇందులో భాష కేవలం మాట్లాడటమే కాదు రాయడం, పదజాలం కూడా రూపొందిస్తున్నారట. అందుకోసం ఒక భాష నిపుణుడిని ఎంపిక చేశారట. ప్రస్తుతం ఆయన ఈ భాషని క్రియేట్‌ చేసే పనిలో ఉన్నారట.

34
మహేష్ బాబు పాత్రకు, ఆ కొత్త భాషకు లింక్ ఏంటి?

అసలు 'వారణాసి' సినిమాలో ఈ కొత్త భాష ఏ సందర్భంలో వస్తుంది? దాని వెనుక ఎలాంటి కల్పిత ప్రపంచం ఉండబోతోంది? మహేష్ బాబు చేస్తున్న పాత్రకు, ఈ భాషకు ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నాయి. వారణాసిలో టైమ్‌ ట్రావెల్‌ ఉంటుంది. అందులో భాగంగా చరిత్రలోని ఒక టైమ్-ట్రావెల్ ప్రయాణంలో పాత్రలు ఈ కొత్త భాషను ఎదుర్కొంటాయి. ఆ సీక్వెన్స్‌లో పాత్రలు ఒక గుహలోకి ప్రవేశిస్తాయి. ఆ గుహ గోడలపై ఒక ప్రాచీన లిపిలో రాతలు ఉంటాయి. వాటిలో దాగి ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవాలంటే… ముందుగా ఆ లిపిని, ఆ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక కొత్త భాషను సృష్టించడం అంటే కొన్ని కొత్త పదాలు రాసేయడం కాదు. దానికి ప్రత్యేకమైన లిఖిత లిపి, వ్యాకరణం, వాక్య నిర్మాణం, పూర్తి నియమ నిబంధనలు కావాలి. ఇంతటి ప్రపంచాన్ని సృష్టించడం చిన్న విషయం కాదు. కానీ దాన్ని సాధ్యం చేసే పనిలో జక్కన్న ఉన్నాడు.

44
ఏప్రిల్‌ 7న వారణాసి రిలీజ్‌

'వారణాసి'ని ఒక సాధారణ యాక్షన్ సినిమాగా కాకుండా, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇలాంటి వార్తలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.

ఇక ఈ చిత్రంలో మహేష్‌ బాబుతోపాటు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ గా నటిస్తున్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌ గా బలమైన పాత్రలో కనిపించనుంది. వీరితోపాటు చాలా మంది ఆర్టిస్ట్ లు కనిపించబోతున్నారట. కేఎల్‌ నారాయణ సుమారు రూ.1200కోట్లతో రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories