వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకులకు చుక్కలు చూపించిన ఫ్లాప్ మూవీస్..ఈ 5 సినిమాల గురించి తెలుసా

Published : Feb 27, 2026, 04:35 PM IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజీ దర్శకులని ఇబ్బంది పెట్టిన 5 ఫ్లాప్ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి. ఈ జాబితాలో శ్రీనువైట్ల, కొరటాల శివ, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులు ఉన్నారు. 

PREV
16
టాలీవుడ్ దర్శకుల ఫ్లాప్ సినిమాలు

టాలీవుడ్ లో కొందరు అగ్ర దర్శకులు వరుస విజయాలతో దూసుకుపోతున్న టైంలో కొన్ని ఫ్లాప్ సినిమాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. కొందరు దర్శకులు అయితే ఆ ఫ్లాప్స్ నుంచి ఇంకా కోలుకోలేదు. మరికొందరు వెంటనే హిట్ సినిమాలు చేసి కెరీర్ ని ట్రాక్ లో పెట్టుకున్నారు. శ్రీనువైట్ల, కొరటాల శివ, సురేందర్ రెడ్డి లాంటి దర్శకుల కెరీర్ ని ఎఫెక్ట్ చేసిన ఆ ఫ్లాప్ సినిమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

26
శ్రీనువైట్ల - ఆగడు

శ్రీనువైట్లకి అంతకు ముందు కూడా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. కానీ ఆగడు సినిమా ఇబ్బంది పెట్టినంతగా మరే సినిమా శ్రీనువైట్లని ఇబ్బంది పెట్టలేదు. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అదే టెంప్లేట్ లో తీస్తే జనాలు చూసేస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఆగడు చిత్రం తెరకెక్కించారు. కానీ ఆగడు డిజాస్టర్ గా నిలిచింది. ఆ ఎఫెక్ట్ తో ఇంకా శ్రీనువైట్ల కోలుకోలేదు.

36
కొరటాల శివ - ఆచార్య

ఆచార్య ముందు వరకు కొరటాల శివ తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ చిరంజీవితో రూపొందించిన ఆచార్య మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. కొరటాల శివ దర్శకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

46
సురేందర్ రెడ్డి - ఏజెంట్

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. నిర్మాతకు దారుణమైన నష్టాలు తప్పలేదు. అంతకు ముందు కూడా సురేందర్ రెడ్డికి ఫ్లాపులు ఉన్నాయి కానీ ఆయన కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ఫ్లాప్.

56
బోయపాటి శ్రీను - దమ్ము

భద్ర, తులసి, సింహా లాంటి సంచలన విజయాల తర్వాత బోయపాటి శ్రీను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దమ్ము చిత్రం రూపొందించారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం వర్కౌట్ కాలేదు. తీవ్రంగా నిరాశ పరిచింది.

66
త్రివిక్రమ్ శ్రీనివాస్ - అజ్ఞాతవాసి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్ అంటే అజ్ఞాతవాసి అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. జులాయి, అత్తారింటికి దారేది, అ ఆ లాంటి వరుస విజయాలకు అజ్ఞాతవాసి చిత్రం బ్రేక్ వేసింది.

Read more Photos on
click me!

Recommended Stories