ఫోన్‌ చేస్తే `ఎవరు మీరంటూ` రవితేజకే షాకిచ్చిన శ్రీనివాస్‌ అవసరాల...ఇన్నేళ్లకు అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్

Published : Sep 01, 2021, 03:29 PM IST

శ్రీనివాస్‌ అవసరాల సినిమా పరిశ్రమకే షాక్‌ ఇచ్చాడు. సినిమాలపై తనకున్న ఒపీనియన్‌ని పంచుకుని షాక్‌కి గురి చేశారు. ఫోన్‌ చేసిన రవితేజనే గుర్తు పట్టలేదని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి ఇంతకి శ్రీనివాస్‌ అవసరాల అలా చేయడానికి కారణమేంటి? అనేది చూస్తే..   

PREV
16
ఫోన్‌ చేస్తే `ఎవరు మీరంటూ` రవితేజకే షాకిచ్చిన శ్రీనివాస్‌ అవసరాల...ఇన్నేళ్లకు అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్

శ్రీనివాస్‌ అవసరాల ప్రస్తుతం `101జిల్లాల అందగాడు` చిత్రంలో నటిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 3న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా శ్రీనివాస్ అవసరాల.. అలీ హోస్ట్ గా రన్‌ అయ్యే `అలీతో సరదాగా` షోలో పాల్గొన్నాడు.

26

ఇందులో అలీతో అనేక సరదా విషయాలను పంచుకున్నాడు శ్రీనివాస్‌. తనకు సినిమాల్లోకి రావడానికి ముందు, అంటే చిన్నప్పుడు సినిమా అంటే ఆర్టిస్టులే అని, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు పనిచేస్తారనే విషయంతెలియదన్నారు. 

36

సినిమాల్లోకి వచ్చినప్పుడు తనకు టాలెంట్‌ లేదని ఓ ప్రముఖ వ్యక్తి డిజప్పాయింట్‌ చేశారట. కానీ ఆయన మాటలు తాను పట్టించుకోలేదని తెలిపాడు. అంతేకాదు తాను సినిమా తీయడం సాధ్యం కాదని ఎవరు చెప్పినా తాను వినలేదని, తనకు ఏం తెలియదని, కానీ చేస్తే ఏదో ఒకటి తెలుస్తుందని తెలిసి వచ్చానన్నారు. తాను సినిమా చేస్తున్న విషయం ఎవరికీ తెలియదని, సినిమా రిలీజ్‌ అయ్యాక తన నాన్న అది చూసి ఇంకెప్పుడు సినిమా చేయకని అన్నారని తెలిపాడు.

46

ఈ క్రమంలో `అష్టాచెమ్మా` చిత్ర సమయంలో జరిగిన ఓ సంఘటనని పంచుకున్నారు శ్రీనివాస్‌ అవసరాల. అలీ `ఓ స్టార్‌హీరో ఫోన్‌ చేస్తే గుర్తు పట్టలేదట` అని ప్రశ్నించగా, దానికి శ్రీనివాస్‌ అవసరాల స్పందించారు. ఆనాటి ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని, సీక్రెట్‌ని వెల్లడిచారు. 

56

`అష్టాచెమ్మా` సినిమా చూసి రవితేజ ఫోన్‌ చేశారట. అయితే సినిమా బాగుందని చాలా సేపు మాట్లాడారట. చివరికి తాను `సర్ మీ పేరేంటి` అని ప్రశ్నించానని, అందుకు రవితేజ స్పందిస్తూ, `నన్ను రవితేజ అంటారు` అని చెప్పాడట. దీంతో నాలుక కర్చుకున్నంత పనైందని తెలిపాడు శ్రీనివాస్‌. 
 

66

అంతేకాదు ఈ సందర్భంగా శ్రీనివాస్‌కి సంబంధించిన ఓ బిగ్‌ సీక్రెట్‌ని కూడా బయటపెట్టారు అలీ. ఫోర్జరీ సంతకాలు చేసేవాడట. ఓ ఐదారుగురికి సంతకాలు చేశానని, కానీ ఓ సారి దొరికిపోయానని, దీంతో ఆ రోజునే దాన్ని మానేశానని తెలిపాడు. ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories