చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల మూవీ పోస్టర్ పై ట్రోలింగ్, డైరెక్టర్ రిప్లై.. ఆ మ్యాటర్ కనిపెట్టేశారు, కానీ

First Published | Dec 4, 2024, 3:51 PM IST

దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన కెరీర్ లోనే అత్యంత క్రేజీ చిత్రానికి రెడీ అవుతున్నారు. నానితో ప్యారడైజ్ అనే చిత్రం తెరకెక్కిస్తున్న శ్రీకాంత్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. 

దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన కెరీర్ లోనే అత్యంత క్రేజీ చిత్రానికి రెడీ అవుతున్నారు. నానితో ప్యారడైజ్ అనే చిత్రం తెరకెక్కిస్తున్న శ్రీకాంత్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. అనౌన్స్ మెంట్ తోనే అత్యంత క్రేజీ చిత్రం గా ఇది మారిపోయింది. 

ఎందుకంటే అనౌన్స్ మెంట్ పోస్టర్ ఒక రేంజ్ వయలెంట్ గా ఉంది. చిరంజీవి చేతిని పోస్టర్ లో చూపించారు. చేయి మొత్తం రక్తంతో తడిచిపోయింది. హింసలోనే అతడికి శాంతి ఉంటుంది అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. చిరంజీవిని డైరెక్ట్ చేయడం శ్రీకాంత్ ఓదెల డ్రీం. తన కలని మూడవ చిత్రంతోనే సాకారం చేసుకునే అవకాశం శ్రీకాంత్ కి దక్కింది. 


మాటిస్తున్నా.. చిరంజీవి అభిమానిగా ఫ్యాన్ బాయ్ తాండవం చూపిస్తా అంటూ శ్రీకాంత్ ఫ్యాన్స్ కి కిక్కు ఇచ్చాడు. అయితే అనౌన్స్ మెంట్ పోస్టర్ ని కొందరు ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే.. పోస్టర్ లో చిరంజీవి చేతికి బ్రేస్లెట్ ఉంది. అదే బ్రేస్లెట్ శ్రీకాంత్ ఓదెల చేతికి కూడా ఉన్నట్లు నెటిజన్లు గుర్తించారు. దీనితో కొందరు నెటిజన్లు నీచేతినే పెట్టి పోస్టర్ రిలీజ్ చేసేశావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

దీనిపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్పందించాడు. మీ కళ్ళు, డీటెయిల్స్ ని గమనించే విధానం నచ్చింది. కానీ మీరు అనుకుంటున్నది తప్ప. అది మన బాస్ మెగాస్టార్ హ్యాండే. ఆయనతో మా ఫస్ట్ కొలాబరేషన్ గుర్తుండి పోవాలని నా బ్రేస్లెట్, అలాగే నాని అన్న బ్రేస్లెట్ ఇచ్చాం. ఆ చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో అంటూ శ్రీకాంత్ ఓదెల ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

Latest Videos

click me!