అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు.. అజిత్‌ని బీట్‌ చేయలేకపోయిన సూపర్‌ స్టార్‌

Published : Sep 09, 2025, 08:15 PM IST

2025 సంవత్సరంలో కోలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాల జాబితా విడుదలైంది. ఆ జాబితాలో ఏ సినిమాలు ఉన్నాయో చూద్దాం.

PREV
16
అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌ 5 మూవీస్‌

కోలీవుడ్‌కి వెయ్యి కోట్లు అనేది ఒక కలగానే మిగిలిపోయింది. రజనీకాంత్‌ `కూలీ` మూవీ దాన్ని బీట్‌ చేస్తుందని అంతా భావించారు. కానీ ఇది ఐదు వందల కోట్ల వద్దనే ఆగిపోయింది. అయితే ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలు ఉంది. ఈ లోపు ఏదైనా మూవీ మ్యాజిక్‌ చేస్తుందా అనే ఆశగా ఎదురుచూస్తున్నారు కోలీవుడ్‌ సినీ లవర్స్. ఈ క్రమంలో ఈ ఏడాది (2025) కోలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌ 5 సినిమాలేంటో ఓ సారి చూద్దాం.  

26
5. తలైవన్‌ తలైవి(సార్‌ మేడమ్‌)

పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమా `తలైవన్ తలైవి`(సార్ మేడమ్‌). సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించిన ఈ మూవీ జూలై నెలలో విడుదలైంది. ఇందులో విజయ్ సేతుపతికి జంటగా నిత్య మీనన్ నటించింది. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా తమిళనాడులో రూ.64.75 కోట్లు వసూలు చేసింది. ఐదవ స్థానంలో నిలిచింది. 

36
4. డ్రాగన్‌

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా `డ్రాగన్`. ఏజీఎస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి నెలలో విడుదలైంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, హర్షద్ ఖాన్, విజే సిద్ధు, మిష్కిన్ వంటి పెద్ద తారాగణం నటించింది. ఈ సినిమా తమిళనాడులో రూ.83 కోట్లు వసూలు చేసి నాల్గవ స్థానంలో ఉంది.

46
3. విడముయార్చి

హీరో అజిత్ కుమార్ నటించిన `విడముయార్చి` సినిమా ఫిబ్రవరి నెలలో విడుదలైంది. ఈ సినిమాకి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. లైకా నిర్మాణంలో విడుదలైన ఈ సినిమాలో త్రిష, ఆరవ్, అర్జున్, రెజీనా వంటి వారు నటించారు. తమిళనాడులో రూ.83 కోట్లు వసూలు చేసి అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల జాబితాలో 3వ స్థానంలో ఉంది.

56
2. కూలీ

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `కూలీ` సినిమా ఆగస్టు నెలలో విడుదలైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ వంటి పెద్ద తారాగణం నటించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా తమిళనాడులో రూ.148.8 కోట్లు వసూలు చేసి రెండవ స్థానంలో ఉంది.

66
1. గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ

ఈ జాబితాలో మొదటి స్థానంలో అజిత్ కుమార్ నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమా ఉంది. ఈ సినిమాకి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, అర్జున్ దాస్, సిమ్రాన్, సునీల్ వంటి వారు నటించారు. ఈ సినిమా తమిళనాడులో రూ.152.65 కోట్లు వసూలు చేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories