చిరంజీవికి అనేక సూపర్ హిట్లు ఇచ్చిన ఓ క్రేజీ డైరెక్టర్ కోసం శ్రీదేవి ఎన్నో ప్రయత్నాలు చేసిందట. శ్రీదేవి మాత్రమే కాదు ఓ స్టార్ హీరో తండ్రి కూడా ఆ దర్శకుడి వెంట పడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ గురించి చెప్పాలి అంటే దర్శకుడు కోదండరామిరెడ్డి గురించి కూడా చెప్పాలి. వీరిద్దరి కాంబోలో 20కిపైగా సినిమాలు వచ్చాయి. ఆల్మోస్ట్ అన్నీ సూపర్ హిట్లే. చిరంజీవి కెరీర్ కి బలమైన పునాది వేసిన దర్శకులలో కోదండరామిరెడ్డి ముందు వరుసలో ఉంటారు. కోదండరామిరెడ్డి బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు లాంటి స్టార్స్ తో కూడా సినిమాలు చేశారు.
25
బాలీవుడ్ నుంచి ఆఫర్లు
కోదండరామిరెడ్డి సక్సెస్ సాధించే సక్సెస్ చూసి బాలీవుడ్ నిర్మాతలు కూడా ఆయన వెంట పడ్డారు. ఎన్నో క్రేజీ ఆఫర్స్ ఆయనకు బాలీవుడ్ నుంచి వచ్చాయి. కానీ ఆయన హిందీలో ఒకటి రెండు మాత్రమే సినిమాలు చేశారు. నేను తెలుగులోనే ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాను. ఇక హిందీ సినిమాలు చేయడం ఎలా కుదురుతుంది అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
35
ఆ డైరెక్టర్ కోసం తపించిన శ్రీదేవి
కోదండ రామిరెడ్డిని బాలీవుడ్ కి రప్పించడం కోసం పెద్ద పెద్ద సెలెబ్రిటీలు తీవ్రంగా ప్రయత్నించారు. లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి అయితే తనపై చాలా ఒత్తిడి చేసింది అని కోదండ రామిరెడ్డి పేర్కొన్నారు. సార్ మీరు బాలీవుడ్ కి రావాలి సార్.. అక్కడ కూడా సినిమాలు చేయాలి అని కోరింది. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి ఒక రాధా ఇద్దరు కృష్ణులు లాంటి సినిమాలు చేసింది.
కోదండ రామిరెడ్డి కోసం శ్రీదేవి ముంబై నుంచి తరచుగా నిర్మాతలని పంపుతూనే ఉండేవారట. ఆయన్ని ఒప్పించి దర్శకుడిగా తీసుకుని వస్తే మీకు డేట్లు ఇస్తాను అని శ్రీదేవి కండిషన్ పెట్టిందట. శ్రీదేవి ఎంతలా ప్రయత్నించినా ఆయన బాలీవుడ్ కి వెళ్ళలేదు. శ్రీదేవి మాత్రమే కాదు.. బాలీవుడ్ అగ్ర నిర్మాతలలోఒకరైన.. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ కూడా తన వెంట పడ్డారు అని కోదండ రామిరెడ్డి తెలిపారు. ఆయన ఏకంగా నా కోసం 10 సార్లు వచ్చారు. నేను బిజీగా ఉండడం వల్ల ఆయనకు సినిమా చేయలేకపోయాను అని కోదండ రామిరెడ్డి పేర్కొన్నారు.
55
ఎన్టీఆర్ సినిమా రిజెక్ట్
కోదండ రామిరెడ్డి సీనియర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా వదులుకున్నారు. ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ పిలిచి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేశారు. జస్టిస్ చౌదరి అనే సినిమా కోదండ రామిరెడ్డి చేయాల్సింది. కానీ కథ అంత బలంగా లేదు.. కొన్ని మార్పులు చేయాలి అని కోదండరామిరెడ్డి ఎన్టీఆర్ తో అన్నారట. ఎంత టైం పడుతుంది అని అడిగారు. మూడు నాలుగు నెలలు పడుతుంది నేను బిజీగా ఉన్నాను అని చెప్పా. లేదు ఒకనెలలోనే చేయాలి అని ఎన్టీఆర్ గారు అన్నారు. అలాగైతే నేను చేయలేను సార్ అని చెప్పినట్లు కోదండ రామిరెడ్డి తెలిపారు. ఆ విధంగా ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నారు.