Keerthy Suresh: రాధికా ఆప్టేను మించిపోయిన కీర్తి సురేష్? మహానటి అరాచకం.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

Published : Nov 15, 2026, 07:56 AM IST

అక్కా సిరీస్‌లో భవానీ పాత్రలో అదరగొట్టి అందరి మనసులు గెలుచుకుంటోంది కీర్తి సురేష్. ఆమె నడక, హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ షోలోనే ఆమె బెస్ట్ అని ప్రశంసిస్తున్నారు!

PREV
15
కీర్తి సురేష్ నటన అదుర్స్

తాజా వెబ్ సిరీస్ 'అక్కా'లో అద్భుత నటనతో మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్. భవానీ పాత్రలో మునుపెన్నడూ చూడని సరికొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించింది. ఆమె పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సిరీస్‌లో రాధికా ఆప్టే లాంటి సీనియర్ నటి ఉన్నా కూడా, అందరి దృష్టి భవానీ పాత్రలో నటించిన కీర్తి మీదే పడింది. కీర్తి నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రేక్షకులు.

25
భవానీ పాత్రలో జీవించిన కీర్తి

కాన్ఫిడెంట్ నడక, అదిరిపోయే హావభావాలతో ప్రతీ సీన్‌లోనూ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది కీర్తి. భవానీ పాత్రలో ఆమె నిజంగా జీవించిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని మెచ్చుకుంటున్నారు. ఒక నెటిజన్ అయితే, "బ్రో.. అక్కా సిరీస్‌లో కీర్తి చంపేసింది!! ఇప్పుడే చూడ్డం పూర్తైంది, అసలు మాడ్ అంతే! రాధికా ఆప్టే అసలు కనిపించలేదు" అంటూ పోస్ట్ పెట్టాడు.

మరొకరు, "ఇది కీర్తి సురేష్ షో! ఎంత అద్భుతమైన సిరీస్.. ఆమె షో మొత్తాన్ని తన వైపు లాగేసుకుంది" అని కామెంట్ చేశాడు. ఇంకొకరు ఆమె నటనను పవర్‌హౌస్ పెర్ఫార్మెన్స్‌తో పోలుస్తూ.. "అక్కా సిరీస్‌లో కీర్తి నటన ఒక పవర్‌హౌస్ లాంటిది, సూపర్!!" అని రాసుకొచ్చారు.

35
భవానీ మేనియా

సిరీస్‌లో కీర్తి స్క్రీన్ ప్రెజెన్స్, భవానీ క్యారెక్టర్‌కు ఆమె తీసుకొచ్చిన ఆరా గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఒక ఫ్యాన్, "అక్కా సిరీస్‌తో కీర్తి సురేష్ తన రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది! ఆమె ఆరా అదిరిపోయింది. ఈ ఏడాదికి నేను భవానీ పర్సనాలిటీని ఫాలో అయిపోదామనుకుంటున్నా" అని రాశాడు. ఇంకొకరు, "గైస్, నేనిప్పుడే అక్కా సిరీస్ చూశా. దీన్ని చూడటానికి ఒకే ఒక్క రీజన్.. కీర్తి సురేష్! ఊరికే నేషనల్ అవార్డ్ రాలేదు ఆమెకు" అంటూ కామెంట్ చేశారు.

ముఖ్యంగా భవానీ నడక గురించి, కీర్తి ఆ పాత్రలో చూపించిన అథారిటీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక నెటిజన్, "భవానీ.. ఆమె నడక ఓ మై గాడ్!! రాధికా ఆప్టే కూడా ఇలా చేయలేకపోయింది" అని అన్నాడు. మరొకరు, "అక్కా సిరీస్‌తో ఇది తన షో అని కీర్తి గట్టిగా చెప్పేసింది... ఆ కాన్ఫిడెన్స్, కమాండ్, ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే కళ్లు తిప్పుకోలేకపోతున్నా" అని పోస్ట్ చేశాడు.

45
కీర్తి క్రియేట్ చేసిన ఇంపాక్ట్

రాధికా ఆప్టే, కీర్తి సురేష్.. ఇద్దరి నటననూ అభినందిస్తూనే, కీర్తి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ఒక వ్యూయర్ ఇలా చెప్పాడు.. "రాధికాను తక్కువ చేయడం లేదు కానీ, అక్కా సిరీస్‌లో కీర్తి షోను హైజాక్ చేసింది.. వాట్ యాన్ అబ్సల్యూట్ పవర్‌హౌస్!!!" ఇంకొక రివ్యూలో, "అక్కా రివ్యూ: సిరీస్ మొత్తాన్ని కీర్తి తన భుజాలపై మోసింది! స్క్రీన్ మీద భవానీ ఉన్న ప్రతీసారీ వేరే ఎక్కడా చూడలేము" అని రాసుకొచ్చారు.

55
కొనసాగుతున్న ప్రశంసల జల్లు

కీర్తి మీద ప్రశంసల జల్లు కొనసాగుతూనే ఉంది. ఇంకో ఫ్యాన్, "అక్కా చూడటం పూర్తైంది, కీర్తి నటనకు ఫిదా అయ్యాను! తెరపైకి ఆమె తీసుకొచ్చిన ఆ కమాండ్ ఇంకెవరూ తీసుకురాలేరు" అని అన్నాడు. దీనికి జతగా మరొకరు, "ఆ భవానీ నడక మీద స్టడీ చేయాల్సిందే! కీర్తి చిన్న చిన్న హావభావాలను కూడా చాలా పవర్ ఫుల్ గా మార్చేసింది. రాధికాతో ఉన్న సీన్లలో కూడా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్!" అని రాశాడు.

స్క్రీన్ ప్రెజెన్స్, క్యారెక్టర్ పోర్ట్రేయల్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్.. ఇలా ప్రతి విషయంలోనూ అక్కా సిరీస్ ద్వారా కీర్తి సురేష్ అందరి దృష్టిని ఆకర్షించింది. భవానీ క్యారెక్టర్‌గా కీర్తి మేకోవర్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories