అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే పట్టిందల్లా బంగారమే. చిరంజీవికి అత్యధిక హిట్లు కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే దక్కాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒక చిత్రం విషయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అప్పటికే చిరంజీవి టాలీవుడ్ లో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు. శ్రీదేవి కూడా ఇటు సౌత్ లో, అటు నార్త్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.