Mega Vs Allu : అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇన్స్టా మిస్టరి, వైరల్ వార్తలో నిజమెంత ?

Published : Feb 13, 2025, 06:35 AM IST

 Mega Vs Allu :  తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారని స్ప్రెడ్ అవుతోంది. దాంతో ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చను లేవనెత్తింది.

PREV
14
Mega Vs Allu : అల్లు అర్జున్, రామ్ చరణ్  ఇన్స్టా  మిస్టరి, వైరల్  వార్తలో నిజమెంత ?
Ram Charan Unfollows Allu Arjun on Instagram, Sparking Speculation in telugu


ఏపీ ఎన్నికల సమయం నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య సరైన సత్సంబంధాలు లేవనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.  రీసెంట్ గా  తండేల్‌ (Thandel Movie) ఈవెంట్‌లోనూ అల్లు అరవింద్‌.. చరణ్‌ గేమ్ ఛేంజర్ పై కామెంట్స్ చేసి, తర్వాత సారీ చెప్పారు.  

రామ్‌చరణ్‌ తన ఏకైక మేనల్లుడని, తనకు కొడుకులాంటివాడని పేర్కొన్నాడు. ఈ గొడవకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరాడు. అవన్ని సర్దుమణుగుతున్నాయనేలోగా మీడియాలోకి మరో హాట్ టాపిక్ వచ్చి చేరింది. అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ ని ఆ వార్త సారాంశం. అయితే  వార్తలో నిజమెంత ? 

24
Ram Charan Unfollows Allu Arjun on Instagram, Sparking Speculation in telugu


వాస్తవానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ బంధువులే అయినప్పటికీ... కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ వచ్చింది. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇదే సమయంలో  మెగా, అల్లు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారని స్ప్రెడ్ అవుతోంది. దాంతో ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చను లేవనెత్తింది.

34
Ram Charan Unfollows Allu Arjun on Instagram, Sparking Speculation in telugu


అయితే  అసలు అంతకుముందు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకరినొకరు ఫాలో అయ్యారో లేదనేది తెలియదు. పోనీ ఒకరినొకరు ఫాలో అయినా రీసెంట్ గా రామ్ చరణ్ అన్ ఫాలో అయ్యారనే  క్లారిటీ లేదు.

కానీ, నెటిజన్లు మాత్రం.. అన్ ఫాలో అయ్యాడు అన్ ఫాలో అయ్యాడు అంటూ రచ్చ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది వీళ్లద్దరికి, అలాగే వారి హ్యాండిల్స్ ని హ్యాండిల్ చేసే టీమ్స్ కి తెలుస్తుంది.  

44
Ambulance

  మెగా వర్సెస్ అల్లు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చకి పుల్ స్టాప్ పెట్టేలా ఇటీవల ఒక ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు.

ఇలాంటి టైమ్ లో రామ్ చరణ్ ఇలా అన్ ఫాలో అయ్యే కార్యక్రమాలు ఎందుకు పెట్టుకుంటాడుని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం రెండు కుటుంబాల మధ్య, ఇద్దరి అభిమానుల మధ్య మరింత చిచ్చు పెంచటానికి ఎవరో చేస్తున్న ప్రచారం అని కొందరు కొట్టిపారేస్తున్నారు. అసలు  నిజమేంటనేది తెలియాల్సి ఉంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories