నామినేషన్స్ కి భయపడేంత సీన్ లేదు..శ్రీరామ్ మాస్, షణ్ముఖ్ తల్లి గురించి సంచలన నిజం

First Published | Oct 25, 2021, 11:55 PM IST

Bigg Boss 5 Telugu సోమవారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ ఎపిసోడ్ లో హైలైట్స్ పరిశీలిద్దాం. కన్ఫెషన్ రూమ్ లో లోబో.. రవికి వ్యతిరేకంగా మాట్లాడడంపై ఇంట్లో గుసగుసలు సాగుతూ ఉంటాయి.

Bigg Boss 5 Telugu సోమవారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ ఎపిసోడ్ లో హైలైట్స్ పరిశీలిద్దాం. కన్ఫెషన్ రూమ్ లో లోబో.. రవికి వ్యతిరేకంగా మాట్లాడడంపై ఇంట్లో గుసగుసలు సాగుతూ ఉంటాయి. రవి దాని గురించి కూల్ గా లోబోని ప్రశ్నిస్తాడు. ఏదైనా ఉంటే ముఖం మీదే చెప్పాలని అంటాడు. జరిగిన దానికి క్షమించాలని లోబో రవిని అడుగుతాడు. దీనితో రవి లోబోని క్షమిస్తాడు. 

ఇంతలో బిగ్ బాస్ Nominations ప్రక్రియ ప్రారంభిస్తారు. బజర్ మోగిన ప్రతి సారి పోస్ట్ మాన్ నుంచి ఉత్తరాలు వస్తాయి. ఆ ఉత్తరాల్లో రెండు ఇంటి సభ్యులవి ఉంటాయి. ఇద్దరేసి సభ్యులు వెళ్లి ఆ ఉత్తరాలని తీసుకురావాలి. రెండు లెటర్స్ ఎవరికీ వచ్చాయో చెప్పాలి. ఇద్దరి సభ్యుల్లో ఒకరు మాత్రమే లెటర్ పొందగలరు. అది ఎవరనేది ఉత్తరాలు తీసుకువచ్చిన ఇద్దరు డిసైడ్ చేస్తారు. ఉత్తరం పొందని వ్యక్తి నామినేట్ అవుతారు. అతడి లెటర్ ని ముక్కలుగా మెషిన్ లో చించి వేస్తారు. 


మొదటగా Sreeram , మానస్ వెళ్లి లెటర్స్ తీసుకుని వస్తారు. అందులో ప్రియాంక ఇంటి నుంచి ఒక లేఖ.. లోబో కుటుంబ సభ్యుల నుంచి మరో లేఖ ఉంటుంది. ప్రియాంక ఇప్పుడిప్పుడే తన కుటుంబ సభ్యులకు చేరువవుతోంది కాబట్టి లోబో ప్రియాంక కోసం త్యాగం చేస్తాడు. దీనితో శ్రీరామ్, మానస్ లోబో లేఖని మెషిన్ లో వేసి అతడిని నామినేట్ చేస్తారు. ప్రియాంక మాత్రం లెటర్ అందుకుంటుంది. 

షణ్ముఖ్, కాజల్ లేఖలు ఒకేసారి వస్తాయి. కాజల్ కోసం షణ్ముఖ్ తన తల్లి వద్ద నుంచి వచ్చిన లేఖని త్యాగం చేస్తాడు. సిరి మాత్రం షణ్ముఖ్ ని లేఖ తీసుకోమని చెబుతుంది. నేను భాదపడుతున్నట్లు నువ్వు బాధపడొద్దని చెబుతుంది. కానీ షణ్ముఖ్ కాజల్ కోసం త్యాగం చేస్తాడు. ఆ బాధని భరించలేక షణ్ముఖ్ బాగా ఎమోషనల్ అవుతాడు. మా అమ్మ క్యాన్సర్ తో పోరాడి నెగ్గింది అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టాడు. నేను కూడా ఈ భాద నుంచి తేరుకుంటాను అని అందరి హృదయాలు బరువెక్కేలా చేస్తాడు. రవి, శ్రీరామ్ లేఖలు ఒకేసారి వస్తాయి. శ్రీరామ్ కోసం రవి త్యాగం చేస్తాడు. 

ఇక చివర్లో చిన్న ట్విస్ట్ ఉంటుంది. కెప్టెన్ సన్నీకి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇస్తాడు. చివర్లో జెస్సి మాత్రమే మిగిలి ఉంటాడు. అతడి లేఖని బిగ్ బాస్ సన్నీకి ఇస్తాడు. ఈ లెటర్ ని సన్నీ.. జెస్సికి ఇవ్వకుండా అతడిని నామినేట్ చేయవచ్చు. లేదా ఆ లెటర్ ని జెస్సికి ఇచ్చి మిగిలిన ఇంటి సభ్యులలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.  

ఈ విషయం చెప్పగానే జెస్సి కోసం త్యాగం చేసి తాను నామినేట్ అయ్యేందుకు శ్రీరామ్ ముందుకు వస్తాడు. జెస్సి.. శ్రీరామ్ ని వారించే ప్రయత్నం చేస్తాడు. నావల్ల మీరు నామినేట్ కావడం నాకు రిగ్రెట్ గా ఉంటుంది అని జెస్సి అంటాడు. నా ఫ్యామిలీ పంపిన లెటర్ చదివేశా.. ఇక నామినేషన్ అంటావా దానికి భయపడే సీన్ లేదు అంటూ శ్రీరామ్ మాస్ రిప్లై ఇస్తాడు. అలా శ్రీరామ్ జెస్సి కోసం తాను నామినేట్ అవుతారు. మొత్తంగా ఈ వారం లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ నామినేట్ అయ్యారు. 

Latest Videos

click me!